సౌత్ లో అదీ తెలుగులో బిగ్ బాస్ మొదలైనప్పుడు 9 గంటలకు లేదా 9.30 గంటలకు స్టార్ మా లో ప్రసారం అయ్యేది. గత సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ 4 ముగిసే ముందు నెలవరకు రాత్రి 9.30 నిమిషాలకే బిగ్ బస్ బుల్లితెర మీద ప్రసారం అయ్యేది. ఆ టైం లో బుల్లితెర ప్రేక్షకులు బాగా వీక్షించేవారు. పనులు ముగించుకుని.. డిన్నర్ పూర్తి చేసుకుని బిగ్ బాస్ ని వీక్షించేవారు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 మధ్య నుండి బిగ్ బాస్ టైం చేంజ్ చేసింది స్టార్ మా. అప్పట్లో ఆ టైం చేంజ్ విషయంలో బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరిచారు.
బిగ్ బాస్ లో ఎంత కామెడీ, ఎంత మజా, ఎంత గొడవలు పడిన.. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. బుల్లితెర ప్రేక్షకులు చూసే టైం కూడా యాజమాన్యానికి ఇంపార్టెంట్. మరి 9 లేదా, 9.30 బిగ్ బాస్ కి పర్ఫెక్ట్ టైం. కానీ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు బిగ్ బాస్ ని ప్రసారం చేస్తే.. విలేజెస్ లో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. మరీ బాగా లేట్ టైం లో బిగ్ బాస్ వస్తుంది.. చూడాలని ఉన్నా చూడలేకపోతున్నామని ఫీలైపోతున్నారు. వీక్ డేస్ లో 10 గంటల దాకా వెయిట్ చేసి బిగ్ బాస్ చూడాలా అంటున్నారు. శని, ఆదివారం రాత్రి 9 గంటలకే నాగార్జున వచ్చేస్తూ.. సందడి చేస్తున్నారు.
మరి బిగ్ బాస్ కి ఎక్కువగా పల్లెటూరి జనాలే ప్రేక్షకులు. కాబట్టి... ఆ విషయం బిగ్ బాస్ యాజమాన్యం - స్టార్ మా చర్చించుకుంటే.. బిగ్ బాస్ రేటింగ్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు.