యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన లవర్స్ అనే విషయాన్నీ రెండేళ్ల క్రితమే దీప్తి సునయన బిగ్ బాస్ హౌస్ లో బయట పెట్టింది. తర్వాత దీప్తి సునయన - షణ్ముఖ్ లు స్టార్ మా ప్రోగ్రామ్స్ లో జంటగా పలు షోస్ లో పాల్గొన్నారు. ఇక దీప్తి సునయన - షణ్ముఖ్ లు షార్ట్ ఫిలిమ్స్ తోనూ, డాన్స్ లతోను బాగా ఫెమస్ అయ్యారు. తాజాగా షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 లోకి వచ్ఛాడు. వచ్చాక దీప్తి సునయనాని మరిచిపోలేక పిల్లోస్ మీద, పేపర్స్ మీద దీప్తి పేరు రాసుకుని పెట్టుకున్నాడు. అలా హౌస్ లో చాలామందికి అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా షణ్ముఖ్ ని బిగ్ బాస్ లోకి వచ్చిన హమీద మీద ఒపీనియన్ చెప్పమని కాజల్ అడగగా.. దానికి షణ్ముఖ్ అరే ఏమిటండి ఇది అని సిగ్గు పడిపోయాడు.
ఇక దీప్తి జాగ్రత్త షన్నుపై ఓ కన్నేసి ఉంచమని ఓ కంటెస్టెంట్ చెప్పగా.. షణ్ముఖ్ జాస్వంత్ బర్త్ డే కి దీప్తి సునైన ఓ స్పెషల్ వీడియో ని బిగ్ బాస్ కి పంపింది. దాన్ని బిగ్ బాస్ ప్లే చెయ్యగానే షణ్ముఖ్ ని హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆడేసుకున్నారు. ఇక తర్వాత షణ్ముఖ్ బర్త్ డే.. హౌస్ బయట బెలూన్స్ తో ఇచ్చిన సర్ ప్రైజ్ ఈ రోజు ప్రోమో లో చూపించారు. మరి షణ్ముఖ్ హౌస్ లో బర్త్ డే ని గ్రాండ్ గా చేసుకున్న.. దీప్తి సునయనాని మాత్రం అడుగడునా మిస్ అయినట్లే కనిపిస్తుంది.