Advertisementt

నేను బిజీ.. నా భర్త గురించి తెలియదు: శిల్పా

Thu 16th Sep 2021 09:24 PM
shilpa shetty,raj kundra,raj kundra case,bail  నేను బిజీ.. నా భర్త గురించి తెలియదు: శిల్పా
I'm busy, I don't know about my husband: Shilpa Shetty నేను బిజీ.. నా భర్త గురించి తెలియదు: శిల్పా
Advertisement
Ads by CJ

అస్లీల  చిత్రాల కేసులో జైలు పాలైన నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బెయిల్ కోసం పోరాడుతున్నాడు. తాజాగా ముంబై పోలీస్ లు రాజ్ కుంద్రా పై 1500 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసారు. అందులో నటి శిల్పా శెట్టి ని సాక్షిగా చేర్చారు. అయితే ముంబై పోలీస్ లు తన పేరుని ఛార్జ్ షీట్ లో సాక్షిగా చేర్చడంతో శిల్పా శెట్టి స్పందిస్తూ.. తన భర్త రాజ్ కుంద్రా ఏం చేసేవాడో.. చేస్తూండేవాడో తనకి తెలియదని, తాను షూటింగ్స్ తో బిజీ గా ఉండేదాన్ని అని.. అందువల్లే తనకి తన భర్త చేసే విషయాలు తెలియవని చెప్పింది.

హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ ల గురించి కూడా తనకు తెలియదని, తన భర్త రాజ్ కుంద్రా చేసే పనుల గురించి తానెప్పుడూ పట్టించుకోలేదని.. ఆయన్ని ఎప్పుడూ ఆయన చేసే పనులని గురించి అడగలేదని చెప్పింది. ఇక శిల్పా శెట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ని ముంబై పోలీస్ లు ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఈ కేసులో రాజ్ కుంద్రా కి బెయిల్ కోసం ఆయన లాయర్ కోర్టు చుట్టూ తిరుగుతూన్న కోర్టు మాత్రం రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ ని పెండింగ్ లో పెట్టింది. 

I'm busy, I don't know about my husband: Shilpa Shetty:

Too busy with my work, not aware of what Raj Kundra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ