బిగ్ బాస్ హౌస్ చూస్తే స్వర్గంలా ఉంది అనుకుంటారు. నిజంగానే ఆ లాన్, వాష్ ఏరియా, కిచెన్, బెడ్ రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, స్విమ్మింగ్ పూల్ అబ్బో అదొక భూతాల స్వర్గం అన్నట్టుగా ఉంటుంది. మరి టివిలో అదే చూపిస్తారు. అందరూ అదే నిజమని అనుకుంటారు. కానీ అది నిజం కాదంటున్నారు. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్. అందులో బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారమే ఇంటికెళ్ళిపోయిన సరయు బిగ్ బాస్ హౌస్ అంతా మాయ అంటుంది.
అంటే టివి లో చూపించినట్టుగా అక్కడేం ఉండదు అని. వాష్ రూమ్స్ చూపించడానికి నాలుగైదు చూపిస్తున్నారు కానీ.. అక్కడ రెండే బాత్ రూమ్స్ ఉన్నాయని, అలానే బెడ్స్ సరిపోయినన్ని లేవని.. లోబో, ఉమాదేవి బెడ్స్ లేక కింద పడుకుంటున్నారని, ఫుడ్ సరిపడా సరిపోదని, బాత్ రూమ్స్ రెండే ఉండడం వలన కంటెస్టెంట్స్ ఇబ్బందులు పడుతుంటారని.. సరయు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అసలు రెండు రోజులు తానూ, ఇంకొంతమంది బాత్ రూమ్ కి వెళ్లలేదనే సీక్రెట్ ని బయటపెట్టింది సరయు.. బిగ్ బాస్ చూసేంత ఏం ఉండదు.. అంతా మాయ అంటూ చెప్పుకొచ్చింది.