Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో ముదురు ప్రేమలు

Fri 17th Sep 2021 12:47 PM
bigg boss season 5,bigg boss,bigg boss telugu,bigg boss season 5 update  బిగ్ బాస్ హౌస్ లో ముదురు ప్రేమలు
Aged love track in Bigg Boss House బిగ్ బాస్ హౌస్ లో ముదురు ప్రేమలు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ తెలుగులో మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ సీజన్ జెన్యూన్ గానే నడిచినట్టుగా అనిపించినా.. తర్వాత నుండి మాత్రం ఎవరికి వారే తెలివిగా బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారు. అందులో ముఖ్యంగా లవ్ ట్రాక్స్ పెట్టుకుంటే.. బిగ్ బాస్ టైటిల్ కి చేరువవ్వొచ్చనే ఊహలతో.. బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ మొదలు పెట్టడం బిగ్ బాస్ యాజమాన్యం కూడా అవే హైలెట్ చేస్తూ స్క్రీన్ స్పేస్ ఇవ్వడంతో.. ప్రతి సీజన్ లో ఇలాంటి ప్రేమ జంటలు ఎక్కువైపోయాయి. రెండో సీజన్ లో తేజస్వి - సామ్రాట్ మధ్యన సం థింగ్ సం థింగ్ అని చూపెట్టారు. ఇక సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవిలను హైలెట్ చేసారు. ఇక సీజన్ 4 చెప్పక్కర్లేదు. మోనాల్ గజ్జర్ - అఖిల్ ఆ లవ్ ట్రాక్ తోనే తెగ పాపులర్ అయ్యారు. టైటిల్ కి చేరువగా వెళ్లారు. 

అందుకే ఈ సీజన్ లోను అలాంటి ట్రాక్ తో ఫెమస్ అవ్వాలని శ్రీరామ చంద్ర, మానస్ లు చూస్తున్నారు. శ్రీరామ చంద్ర ప్రియాంక, హమీదాలను ఫ్లట్ చేస్తున్నాడు. మానస్ లహరిని ఇలా ఎవరి ట్రైల్స్ లో వాళ్ళు ఉండగా.. మధ్యలో ముదురు ప్రేమలో మొదలయ్యాయి. అందులో లోబో - ఉమాదేవి హగ్స్, కిస్ లతో రెచ్చిపోతున్నారు. వారికీ స్క్రీన్ స్పేస్ కావాలి. కాబట్టి ఇలాంటిది ఏదో చేస్తే బావుంటుంది అని ఫిక్స్ అయినట్లుగా.. వారి మధ్యన కెమిస్ట్రీ స్టార్ట్ అయ్యింది. మరి ఈసారి యంగ్ రొమాంటిక్ కపుల్ కన్నా ముదురు రొమాంటిక్ కపుల్ హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. 

Aged love track in Bigg Boss House:

Bigg Boss season 5 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ