బిగ్ బాస్ 5 లో ఉన్న ఏకైన గ్లామర్ గర్ల్ సిరి హన్మంత్. సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ తో ఫెమస్ అయిన సిరి.. బిగ్ బాస్ లో కాస్త యాక్టీవ్ గాను, గ్లామర్ గాను కనిపిస్తుంది. అయితే సిరి మగవాళ్ళను అంటే సన్ని, యాంకర్ రవి, షణ్ముఖ్ లని అడ్డం పెట్టుకుని ఆడుతుంది అంటూ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ సరయు చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపించేలా ఉంది సిరి ఓవరేక్షన్. గత వారం కెప్టెన్సీ టాస్క్ లో సిరి నా టీ షర్ట్ లో సన్నీ చెయ్యి పెట్టి పిల్లో తీసాడంటూ సంచలనంగా మాట్లాడింది. నేను అలా చెయ్యలేదు అని సన్నీ మొత్తుకున్నా.. సిరి వినలేదు.
తాజాగా శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అందరిని మీరు మీరు చేసిన తప్పుల గురించి చెప్పండి అనగానే సన్నీ నేను కాస్త ఎక్కువ అగ్రెసివ్ గా ఆడాను అనగానే.. సిరిని అడిగితే సన్నీ నీ టి షార్ట్ లో చెయ్యి పెట్టాడు అని అంది. సరే వీడియో చూద్దామని నాగ్ అనగానే వీడియో ప్లే చేసారు. షణ్ముఖ్ కూడా సిరిని సపోర్ట్ చెయ్యడంతో.. ఆ వీడియో చూడగానే సన్నీ సిరి టి షార్ట్ లో చెయ్యి పెట్టలేదు.. అంతా సిరి ఓవరేక్షన్ అని తేలిపోవడంతో సిరి సన్నీకి సారీ చెప్పింది. వారం అంతా సన్నీ కాస్త వరెస్ట్ పెరఫార్మెర్ గా గడిపినా శనివారం ఎపిసోడ్ తో హీరో అయ్యాడు. సిరి ఓవరేక్షన్ బయట పడింది.