తమిళ్ స్టార్ హీరో విజయ్ తన తల్లితండ్రులపై కేసు పెట్టడం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తన తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరు మీద పార్టీ పెట్టి.. విజయ్ పేరు మీద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ.. తండ్రి పార్టీ పెట్టిన కొత్తల్లోనే విజయ్ ఆ పార్టీ కి నాకు సంబంధం లేదని ప్రకటించాడు. విజయ్ మక్కల్ ఇయ్యకమ్ పార్టీ పెట్టిన విజయ్ తండ్రి.. ఆ పార్టీ కార్యకలాపాలని, విజయ్ పేరు అడ్డం పెట్టుకుని పార్టీ నడపాలని అనుకున్నారు. కానీ విజయ్ మాత్రం తండ్రి పార్టీకి నాకు సంబంధం లేదని అన్నారు.
అయినప్పటికీ తల్లిదండ్రులు విజయ్‌పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారని హీరో విజయ్ తల్లితండ్రులపై పోలీస్ లకి కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయ్ తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు.