మెగాస్టార్ చిరు సినిమాలో సాయి పల్లవి ని సిస్టర్ కేరెక్టర్ కి సంప్రదించగా.. దానిని సాయి పల్లవి రిజెక్ట్ చేసింది అనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. తాజాగా ఆ విషయంపై చిరు లవ్ స్టోరీ ఈవెంట్ లో మ ట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది.
సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ ఫిదా లో సాయి పల్లవి పక్కన డాన్స్ చేసింది నేను చూసాను అని నా దగ్గరికి వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమా భోళా శంకర్ లో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదు.
ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది. నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా అంటూ సాయి పల్లవితో చిరు రెండు మూడు డాన్స్ స్టెప్స్ వెయ్యడం చూస్తే రెండు కళ్ళు సరిపోవు మరి.