Advertisementt

సినిమా పెద్దలతో మంత్రి భేటీకి టైం ఫిక్స్

Sun 19th Sep 2021 10:04 PM
cine celebrities,tollywood celebrities,ap minister,minister perni nani  సినిమా పెద్దలతో మంత్రి భేటీకి టైం ఫిక్స్
Time fix for Meeting with minister and film celebrities సినిమా పెద్దలతో మంత్రి భేటీకి టైం ఫిక్స్
Advertisement
Ads by CJ

రేపు సెప్టెంబర్ 20 సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏపీ మంత్రి పేర్ని నాని ని మీట్ అవ్వబోతున్నారు. ఏపీ సీఎం ని కలవాలని సినీ పెద్దలు అనుకున్నప్పటికీ.. జగన్ అప్పోయింట్మెంట్ సినీపెద్దలకి దొరకలేదు. ఇక మంత్రి పేర్ని ని మీట్ అయ్యి సినిమా పరిశ్రమలోని సమస్యలు, ఏపీ థియేటర్స్, టికెట్స్ రేట్స్ విషయమై ఆయనతో మాట్లాడబోతున్నారు. ఏపీ సచివాలయంలో సినిమా పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. 

మంత్రి తో సమావేశంలో సినిమా నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు పాల్గొననున్నారు. ఆన్‌లైన్  టికెట్ వ్యవస్థ, కోవిడ్  వల్ల సినిమా  పరిశ్రమకు  ఎదురైన ఇబ్బందులపై సమావేశంలో చర్చించనున్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని చెప్పారు. మరి రేపటి సమావేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం సినీపెద్దల భేటీ ఏ సమస్యకు పరిష్కారం చూపుతుందో. 

Time fix for Meeting with minister and film celebrities :

Time fix for Meeting with AP minister Perni Nani and film celebrities 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ