Advertisementt

టాలీవుడ్ పెద్దలతో మినిస్టర్ మీటింగ్ హైలైట్స్

Mon 20th Sep 2021 05:46 PM
tollywood senior producers,distributors,meeting,ap minister perni  టాలీవుడ్ పెద్దలతో మినిస్టర్ మీటింగ్ హైలైట్స్
Tollywood Senior Producers Meeting With AP Minister Perni టాలీవుడ్ పెద్దలతో మినిస్టర్ మీటింగ్ హైలైట్స్
Advertisement
Ads by CJ

ఈ రోజు ఉదయం టాలీవుడ్ సినీ పెద్దలతో ఏపీ మినిస్టర్ పేర్ని నాని భేటీ అయ్యారు. ఎప్పటి నుండో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఏపీ సీఎం జగన్ తో మీటింగ్ కోసం వెయిట్ చేస్తుంటే.. మధ్యలో మంత్రి నాని అప్పోయింట్మెంట్ దొరకడంతో నేడు సినీ పెద్దలు మంత్రి నాని తో మీటింగ్ కి హాజరయ్యారు. 

సినిమా పెద్దలతో నాని మీటింగ్ హైలెట్స్ 

ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాం. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు. దానయ్య,  రామ సత్యనారాయణ .ఎన్వీ ప్రసాద్, నిర్మాత. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం జరిగింది. కొన్నేళ్ల తర్వాత ఈ స్థాయిలో సమావేశం జరగడం తొలిసారి. రెండు రాష్ట్రాల తర్వాత సినిమా వాళ్లతో ఇలాంటి మీటింగ్ జరగడం ఇదే ప్రధమం.  

ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారు. టిక్కెట్ల ధరల పెంపుపై చర్చే జరగలేదు. థియేటర్ల మెయిన్టెనెన్స్ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం... అంటూ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడారు. 

ఇక ఈ మీటింగ్ కి హాజరైన ఆది శేషగిరి రావు మాట్లాడుతూ.. 

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేది. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరాం. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు... అంటూ చెప్పుకొచ్చారు. 

Tollywood Senior Producers Meeting With AP Minister Perni:

Tollywood Senior Producers and Distributors Meeting With AP Minister Perni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ