బిగ్ బాస్ లో సోమవారం రాత్రి నామినేషన్స్ ప్రక్రియ వాడిగా వేడిగా కాదు.. పూర్తి వేడిగా జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ప్రియా లహరిని నామినేట్ చేస్తూ.. నువ్వు హౌస్ లో ఉన్న ప్రతి అబ్బాయితో బిజీగా వున్నావ్ అంటూ పదే పదే మాట్లాడడంతో యాంకర్ రవి ప్రియా పై ఫైర్ అయ్యాడు. రవి కి రెస్ట్ రూమ్ లో అర్ధరాత్రి టైట్ హాగ్ ఇచ్చింది లహరి అంటూ.. వాళ్ళు తప్పు చేసినట్లుగా ప్రియా చెప్పుకొచ్చింది. దానితో లహరి, రవి ఇద్దరూ ప్రియపై పడిపోయారు. ఇక ఈ రోజు కూడా ఈ వేడి చల్లారలేదు. రవి - లహరి మాట్లాడుకుంటూ.. నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నాను.. నేను నీ వెనకాల పడుతున్నాను, ఇక్కడ యంగ్ మ్యారీడ్ మెన్ చాలామంది ఉన్నారు. తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు అని ప్రియా నీతో చెప్పిందట కదా రవి అని చెప్పింది లహరి.
అయితే రవి మాత్రం ప్రియా దగ్గరకు వెళ్లి అక్క నేను ఆ మాటే అనలేదు. సింగల్ మెన్ అనే మాటే అనలేదు. నేని మ్యారీడ్ మెన్, సింగిల్ మ్యాన్ ఆ మాట ఎందుకు అనగానే.. ప్రియా మాత్రం నువ్వు అన్నావ్ బ్రో.. నువ్వు అన్నావ్ అంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేరే విధంగా చేసి నన్ను బ్యాడ్ గా ప్రోజెక్ట్ చెయ్యాలని చూస్తున్నారు అని రవి లహరి వాళ్లతో చెబుతాడు. ఇక ప్రియా ఒంటరిగా అమ్మ నేను చూసిందే మాట్లాడాను, ఏది కల్పించి మాట్లాడలేదు. నేను విన్నదే చెప్పాను. నువ్వు ఏదైతే నేర్పించావో నేను అలానే ఉన్నాను. నువ్వు నమ్మితే ఛాలమ్మ నాకు అంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియా.