Advertisementt

వారం వారం స్పెషలే

Tue 21st Sep 2021 09:59 PM
mahesh babu,chief guest,ntr,ntr evaru meelo koteeswarulu show  వారం వారం స్పెషలే
Mahesh Babu is the next chief guest on NTR Evaru Meelo Koteeswarulu వారం వారం స్పెషలే
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టివిలో మొదలైన ఎవరు మీలో కోటీశ్వరులు షో.. మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు ఓపెనింగ్ ఎపిసోడ్ కి రామ్ చరణ్ ఫస్ట్ గెస్ట్ గా వచ్చాడు. ఆ ఎపిసోడ్ టిఆర్పి జెమినీ ఛానల్ ని టాప్ లో నిలిచేలా చేసింది. ఇక తర్వాత కొన్ని వారాలు ఎలాంటి గెస్ట్ లు హాజరవకపోయినా.. ఈ సోమవారం కొరటాల శివ - రాజమౌళి లు గెస్ట్ లుగా వచ్చారు. ఇక వచ్చే వారం ఎవరు మీలో కోటీశ్వరులు షో లో సూపర్ మహేష్ రాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మరి మహేష్ గెస్ట్ గా ఎన్టీఆర్ షో అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. 

మహేష్ బాబు హాట్ సీట్ లో, ఎన్టీఆర్ హోస్ట్ సీట్ లో ఉంటే.. అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ ఇద్దరు హీరోల అభిమానులకి పండగే. మరి మహేష్ తర్వాత వారంలో ఎవరు.. ఎవరు మీలో కోటీశ్వరులు షో కి వస్తారో కానీ.. వారం వారం ఎవరో ఓ గెస్ట్ ని ఈ షో కి తీసుకురావాలని జెమినీ ఛానల్ వారు ఫిక్స్ అయ్యారంటున్నారు. మరి మహేష్ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్, ఇంకా మిగతా సెలబ్రిటీస్ కూడా ఈ షో కి గెస్ట్ లుగా వస్తే.. ఈ షో క్రేజ్, టిఆర్పి రేటింగ్ మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. 

Mahesh Babu is the next chief guest on NTR Evaru Meelo Koteeswarulu:

Mahesh Babu is the next chief guest on NTR Evaru Meelo Koteeswarulu show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ