Advertisementt

సాయి ధరమ్ కోలుకుంటున్నాడు: చిరు

Wed 22nd Sep 2021 11:29 AM
sai dharam tej,sai tej republic movie,republic movie,republic trailer launch  సాయి ధరమ్ కోలుకుంటున్నాడు: చిరు
Chiranjeevi releases Republic trailer సాయి ధరమ్ కోలుకుంటున్నాడు: చిరు
Advertisement
Ads by CJ

వినాయక చవితి రోజున బైక్ యాక్సిడెంట్ లో గాయాలపాలై అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నట్లుగా అపోలో డాక్టర్స్ ఎప్పటికప్పుడు హెల్త్ అప్ డేట్ ఇస్తున్నారు. వారం క్రితం షోల్డర్ బోన్ కి శస్త్రచికిత్స చేసిన కాక్టర్స్ రీసెంట్ గా ఓకల్ కార్డు ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. ఇక ఐసీయూ నుండి స్పెషల్ వార్డ్ కి సాయి ధరమ్ తేజ్ ని మార్చి.. డాక్టర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ఇక సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా రిపబ్లిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీం.

సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉండడంతో సాయి ధరమ్ పెద్ద మావయ్య చిరు రంగంలోకి దిగారు. రిపబ్లిక్ ట్రైలర్ మెగాస్టార్ చేతుల మీదుగా ఈ రోజు లాంచ్ చేసారు. మెగాస్టార్ సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్ లాంచ్ చేస్తూ.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.. అంటూ ట్వీట్ చేసారు. ఇక దేవాకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా.. రమ్యకృష్ణ, జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన రిపబ్లిక్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 1 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. 

 

 

Chiranjeevi releases Republic trailer:

Sai Dharam tej Republic trailer launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ