మెగాస్టార్ చిరు చేతుల మీదుగా దేవాకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ ట్రైలర్ ని లాంచ్ చేసింది టీం. ఇక అక్టోబర్ 1 న రిలీజ్ కి రెడీ అవుతున్న సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్ లోకి వెళితే..
సమాజంలో తిరగడానికి అర్హతే లేని గూండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకి కొమ్ముకాస్తున్నాయి అంటూ సాయితేజ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్, సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది.
ఆ రాక్షసులు ప్రపంచం అంతటా ఉన్నార్రా, కానీ వాళ్లని ఈ వ్యవస్థ పోషిస్తుందా.. శిక్షిస్తుందా? అన్నదే తేడా అని జగపతిబాబు చెప్పే ఎమోషనల్ డైలాగ్
జిల్లాకు సుప్రీమ్ అథారిటీ కలెక్టర్.. నేను ఆ సుప్రీమ్ అథారిటినీ అని సాయితేజ్ తన క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు.
రాజ్యాంగం ప్రకారం చట్ట సభల ఆదేశాల మేరకే ఉద్యోగస్థలు పనిచేయాలనే విషయం మరచిపోయినట్లున్నావ్ అని రాజకీయ నాయకురాలైన రమ్యకృష్ణ, సాయితేజ్‌ను ఉద్దేశించి అంటే,
అదే రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆదేశాలు మారణహోమానికి దారి తీస్తే, ఉద్యోగస్థులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.. ఫాలో అయితే మీలాంటోళ్లు హిటర్లవుతారు అంటూ సాయితేజ రివర్స్ కౌంటర్ ఇచ్చే డైలాగ్‌తోనే సినిమా ప్రధానాంశం ఏంటో క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది.
మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు
అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్డు పెడుతుంది’’ వంటి కొన్ని డైలాగ్స్ ట్రైలర్ మధ్య మధ్యలో టెంపోని క్యారీ చేశాయి.
గాడి తప్పిన లేజిస్లేటివ్ గుర్రాన్ని ఈరోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ.. న్యాయవ్యవస్థ కూడా తన కాళ్ల మీద నుంచోని ఆ గుర్రానికి కళ్లమయినప్పుడే ఇది అసలైన రిపబ్లిక్
అని ట్రైలర్ చివర్లో టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చేలా సాయితేజ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.
హీరో సాయితేజ్, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్, కీలక పాత్రల్లో నటించిన జగపతిబాబు, రమ్యకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, నాజర్ తదితరుల్ని ట్రైలర్‌ను చూడొచ్చు.