Advertisementt

బాబాయ్ అబ్బాయ్.. రానానాయుడు

Wed 22nd Sep 2021 12:40 PM
netflix,rana naidu web series,rana - venkatesh,rana daggubati,venkatesh  బాబాయ్ అబ్బాయ్.. రానానాయుడు
Netflix announces Rana Naidu starring Rana - Venkatesh బాబాయ్ అబ్బాయ్.. రానానాయుడు
Advertisement
Ads by CJ

దగ్గుబాటి హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తే అది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు పండుగే. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ పట్టేసింది. బాహుబలి భళ్లాల దేవ అకా రానా దగ్గుబాటి, అతని బాబాయ్ సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటిలతో రానా నాయుడు అనే డ్రామా సిరీస్‌‌ను తెరకెక్కించేందుకు సిద్దమైంది నెట్ ఫ్లిక్స్. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్. అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అమెరికన్ పాపులర్ డ్రామా రే డోనోవన్ షో టైం నుంచి కాన్సెప్ట్‌ను తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

సెప్టెంబర్ 22, 2021 : బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఎప్పుడైనా అత్యవసర సాయం ఏర్పడితే ఎవరికి ఫోన్ చేస్తారో? అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? దానికి సమాధానం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉంది. అదే రానా నాయుడు. ఆయన ఎలాంటి సమస్యను అయినా సరే ఇట్టే పరిష్కరించగలరు.

ఈ యాక్షన్ డ్రామాలో రానా నాయుడు జీవిత కథ ఉండబోతోంది. బాలీవుడ్‌లో ప్రముఖులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్‌ హక్కులను వయకాయ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రీబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. కరన్ అన్షుమాన్ షో రన్నర్ మాత్రమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. సుపర్న్ వర్న కో డైరెక్టర్‌గా పని చేయనున్నారు.

ఈ సిరీస్ గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇది నాకెంతో ప్రత్యేకం. నా చిన్నాన్నతో కలిసి మొట్టమొదటి సారిగా నటించడం, అది కూడా నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మా కెరీర్‌లోనే ఎంతో భిన్నమైన ప్రాజెక్ట్. ఇటువంటివి మేం ఎప్పుడూ చేయలేదు. ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతోందని నాకు తెలుస్తోంది. ఇందులో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది సవాల్‌తో కూడుకున్నది అయినా కూడా ఎంతో సరదాగా ఉండోబోతోందనే నమ్మకం ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ.. రానాతో కలిసి పని చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇక మేం ఇద్దరం కలిసి త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైన్ చేస్తాం.. ఇది మాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. నేను రాయ్ డోనోవన్‌కు వీరాభిమానిని. ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను అని అన్నారు.

వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. వైస్ ప్రెసిడెంట్, రొక్సాన్నే పొంపా మాట్లాడుతూ.. లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్, సుందర్ అరోన్, నెట్ ఫ్లిక్స్‌తో కలిసి రానా నాయుడు కోసం పని చేయడం, ఇండియన్ మార్కెట్‌లోకి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాతృక నుంచి తీసుకున్న స్టోరీ లైన్, మన నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు చేర్పులు, ఆ పాత్రకు వారు సరిపయిన విధానం అన్ని కూడా బాగున్నాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని అన్నారు.

సుందర్ ఆరోన్ (లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్) మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కచ్చితంగా అద్భుతమైన ఫీలింగ్, థ్రిల్లింగ్‌ను రానా నాయుడు ప్రాజెక్ట్ ఇస్తుంది. మాకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. టాప్ క్వాలిటీ, షో రన్నర్, డైరక్టర్స్, ప్రొడక్షన్ టీం, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ కోసం, రానా నాయుడును ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు మేం ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని అన్నారు.

Netflix announces Rana Naidu starring Rana - Venkatesh:

Venky and Rana web series titled Rana Naidu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ