మెగాస్టార్ చిరు ఊటీకి వెళుతున్నారు. ఊటీ అంటే.. ఏ వెకేషనో, ఏ పర్సనల్ ట్రిప్ కో కాదు.. ఆయన నటిస్తున్న మలయాళ హిట్ ఫిలిం లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూట్ కోసం చిరంజీవి ఆయన గాడ్ ఫాదర్ టీం ఊటీకి పయనమైంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుపుకున్న గాడ్ ఫాదర్ ఇప్పుడు ఊటీ షెడ్యూల్ కోసం పయనమైనట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మోహన్ లాల్ పాత్ర చేస్తున్నారు. ఆయనకి సిస్టర్ గా నయనతార నటిస్తుంది అనే టాక్ ఉంది. కానీ ఇంతవరకు గాడ్ ఫాదర్ నటినాటులని పరిచయం చెయ్యలేదు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, మెగా ఫాన్స్ కి రుచించేలా లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ ని మోహన్ రాజా రెడీ చేసారని.. ఊటీ లో ఈ రోజు నుండి రెండు వారాల పాటు గాడ్ ఫాదర్ షెడ్యూల్ కొనసాగానున్నట్లుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.