Advertisementt

ఎన్టీఆర్ అంటే ఇష్టమే.. కానీ

Thu 23rd Sep 2021 09:48 AM
ntr,evaru meelo koteeswarudu show,young tiger ntr,ntr bhajana show  ఎన్టీఆర్ అంటే ఇష్టమే.. కానీ
NTR Evaru Meelo Koteeswarulu Show Highlights ఎన్టీఆర్ అంటే ఇష్టమే.. కానీ
Advertisement
Ads by CJ

స్టార్ హీరో ఎన్టీఆర్ అంటే ఇష్టం లేని వారు ఉండరు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో పుట్టిన ఎన్టీఆర్ అంటే.. నందమూరి అభిమానులకి, సీనియర్ ఎన్టీఆర్ ని ఆరాధించే కుటుంబాలకి అందరికి ఇష్టమే. నందమూరి ఫ్యామిలీ బాలయ్యని కాదని ఎన్టీఆర్ ని మొయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కి సపరేట్ ఫాన్స్ ఉన్నారు. ఇక టిడిపి లోను ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ మద్యన జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. 

ఈ షో లో ఎన్టీఆర్ స్టయిల్, ఎన్టీఆర్ వాక్చాతుర్యానికి అందరూ ఫిదానే. కాకపోతే.. ఆ షో కి వచ్చేవాళ్ళు అంతా ఎన్టీఆర్ అభిమానులు అన్నట్టు, ఎన్టీఆర్ ని చూసేందుకు షో కి వచ్చినట్టు, ఎన్టీఆర్ ఫొటోస్ తమ ఇంట్లో ఉన్నట్టు.. ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్లే కనిపిస్తున్నారు. షో లో ఎన్టీఆర్ తో మీరంటే అలా, మీరంటే ఇలా, మీరంటే చాలా అభిమానము అంటూ ఎన్టీఆర్ భజన చేస్తున్నారు. ప్రతి కంటెస్టెంట్స్ కూడా ఎన్టీఆర్ గురించి తెగ మాట్లాడెయ్యడం కొంతమందికి నచ్చడం లేదు. అది జెమినీ వారు గ్రహించి.. కాస్త సరిచేస్తే ఓకె లేదంటే.. మరీ ఎన్టీఆర్ షో కాస్త.. ఎన్టీఆర్ భజనమందిరం అవ్వడం ఖాయం. 

NTR Evaru Meelo Koteeswarulu Show Highlights :

NTR Evaru Meelo Koteeswarudu Show 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ