బిగ్ బాస్ 5 కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ల్లో ప్రతి కంటెస్టెంట్ కష్టపడినట్లే కనిపించినా.. అంతగా బుల్లితెర ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఫీల్ అవ్వలేకపోయారు. ఇక జెస్సి కెప్టెన్ అయ్యాక హౌస్ లో జెస్సిని మాయ చేస్తూ నిద్రపోతున్నారు. లోబో అయితే అలా కుర్చీల చాటున పడుకుని నేను కాదు పడుకున్నది అని జెస్సితో చెప్పగా.. నేను ఎవరిని చూడడం లేదు.. అందుకే నన్ను నేను పనిష్ చేసుకుంటున్నాను అంటూ గుంజీలు తియ్యగా.. హౌస్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారు. టైం వచ్చినప్పుడు అంతు చూస్తా అని నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యాడు. ఇక లగ్జరీ బడ్జెట్ కోసం హౌస్ మేట్స్ అంతా బాల్స్ విసిరారు. నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం వేడుకని చూపించారు గత రాత్రి హౌస్ లో, నటరాజ్ బాగా ఎమోషనల్ అయ్యాడు.
హమీద నీకు మానస్ ఫ్రెండ్.. దానికి పేరుంది.. కానీ నువ్వు నాకేమవుతో క్లారిటీ రావడం లేదు అంటూ శ్రీరామ చంద్ర అండ్ హమీద లు మాట్లాడుకున్నారు. హౌస్ లో వరెస్ట్ పెరఫార్మెర్ గా మానస్ తనని తానే నామినేట్ చేసుకోగా.. దానితో హౌస్ లో చాలామంది కంటెస్టెంట్స్ అతనిని అతనే వరెస్ట్ పెరఫార్మెర్ గా చెప్పుకోవడం నచ్చలేదు.. దానితో మానస్ ని జైలుకి పంపారు. మానస్ జైలుకి పోతున్నా ఎవరూ ఫీల్ కాలేదు. విశ్వ అయితే మానస్ జైలు కెలుతున్నా ఏం అనిపియ్యడం లేదు. కారణం తనకి తానుగా వరెస్ట్ పెరఫార్మెర్ గా చెప్పుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. సో గత రాత్రి ఎపిసోడ్ అలా కూల్ గా చప్పగా నడిచింది.