Advertisementt

రిపబ్లిక్ ఈవెంట్ లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పీచ్

Sun 26th Sep 2021 01:50 PM
pawan kalyan,republic pre release event,sai tej,vaishnav tej,pawan kalyan speech at republic event  రిపబ్లిక్ ఈవెంట్ లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పీచ్
Pawan Kalyan Speech at Republic Pre release event రిపబ్లిక్ ఈవెంట్ లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పీచ్
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ - దేవా కట్ట రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సాయి తేజ్ అపోలో హాస్పిటల్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఆయన ఈ ఈవెంట్ కి హాజరుకపోయినా.. సాయి తేజ్ మేనమావలు చిరు రిపబ్లిక్ ట్రైలర్ లాంచ్ చెయ్యగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరై.. రిపబ్లిక్ ని ప్రమోట్ చేస్తున్నారు. రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. 

నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్‌కు రాలేదు. త‌న మొద‌టి సినిమా స‌మ‌యంలో వ‌చ్చాన‌ని అనుకుంటున్నాను. దానికి కార‌ణం.. ఇంట్లో మా అక్క‌య్య కొడుకుగా త‌న‌ను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. . గోకులంలో సీత సినిమా విష‌యానికి వ‌చ్చేస‌రికి అన్న‌య్య స‌పోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వ‌చ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణ‌వ్ కానీ.. ఎవ‌రైనా కుటుంబంపై ఆధాప‌ప‌డ‌కూడ‌దు. క‌ష్ట‌మో, న‌ష్ట‌మో..సొంతంగా జ‌ర్నీ చేయాలి. కానీ ఈరోజు ఫంక్ష‌న్‌కు రావ‌డానికి కార‌ణం, నిర్మాత‌లు ఇంత ఖ‌ర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా రిలీజ్ టైమ్‌లో అంద‌రూ హ్యాపీగా ఉండాలి. కానీ తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్‌కు గురికావ‌డమ‌నేది చాలా బాధాక‌ర‌మైన విష‌యం. హీరో ఫంక్ష‌న్‌లో లేని లోటు తెలియ‌నీయ‌కుండా మ‌నవంతు ఏదో చేయాల‌ని నేనిక్క‌డికి వ‌చ్చాను. మీ అంద‌రి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే అంద‌రూ ఆనందంగా ఉండాల‌ని కోరుకునే వ్య‌క్తి తేజు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. సినిమా అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించాలి. 

ఇక ఈ మ‌ధ్య కాలంలో నేను ఫీలైందేంటంటే.. తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిట‌ల్లో ఉన్న‌ప్పుడు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మిత్రులు, పెద్ద‌లు వ‌చ్చి కోలుకోవాలని ప్రార్థించారు. కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. తేజ్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది.. చాలా స్పీడుతో న‌డుపుతున్నాడు.. నిర్ల‌క్ష్యంతో న‌డుపుతున్నాడు.. క‌థ‌లు వ‌చ్చాయి. ఆటోను దాటించేట‌ప్పుడు ఎంత స్పీడులో వెళ‌తాడు న‌ల‌బై ఐదు కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లి ఉండొచ్చు. ఇసుక ఉండ‌టం వ‌ల్ల ప‌డిపోయాడు. జాలిప‌డాలి మ‌నం. దాని మీద క‌థ‌నాలు అల్లి, మాట్లాడితే ఎలా? అలాంటి వ్య‌క్తుల‌కు నా విన్న‌పం ఏంటంటే.. కొంచెం క‌నిక‌రం చూపించండి. మేమూ మ‌నుషుల‌మే క‌దా! ఇలాంటి ప‌రిస్థితి మీకు రాద‌ని గ్యారంటీ ఏంటి?  మీకు కూడా వ‌స్తుంది క‌దా. ద‌య‌చేసి కొంత క‌నిక‌రం చూపించండి. దేవ‌క‌ట్టాగారు చేసిన ప్ర‌స్థానం సినిమా చూశాను. చాలా చ‌క్క‌టి సినిమా. ఆటోన‌గ‌ర్ సూర్య చేసినప్పుడు ఆ నిర్మాత‌లు క‌లిసి చాలా చ‌క్క‌టి ద‌ర్శ‌కుడు అని చెబుతుండేవారు. రిప‌బ్లిక్ సినిమాను కూడా సామాజిక స్పృహ‌తో చేశారు. భార‌త రాజ్యాంగం ఏం చెప్పింది. మ‌న ప్రాథ‌మిక హ‌క్కులేంటి? అనే దానిపై మాట్లాడే సినిమా అని అర్థ‌మ‌వుతుంది. జైహింద్ అని నేను ప్ర‌తి స‌భ‌లో చెబతుంటాను. ఓ భ‌గ‌త్ సింగ్‌, సుభాష్ చంద్ర‌బోస్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌, మ‌హాత్మాగాంధీజీ వంటి వేల‌కొల‌ది మ‌హానుభావులు ప్రాణ త్యాగం చేస్తే కానీ, భార‌త దేశం గ‌ణ‌తంత్య్ర దేశంగా ఆవిర్భ‌వించ‌లేదు. అంత గొప్ప త్యాగాల‌కు గుర్తు. స్వాతంత్య్ర ఉద్య‌మ కారులు ఎంతో త్యాగం చేశారు. కానీ రాను రాను.. పాలిటిక్స్‌లో దిగ‌జారుడుత‌నం వచ్చేసింది. హుందాత‌నం పోయింది.  

ఆ భావన‌ను ఓ క‌వి దాన్ని క‌విత‌గా రాస్తాడు. ఓ ద‌ర్శ‌కుడు దాన్ని సినిమాగా తెర‌కెక్కిస్తాడు. నీ స్వేచ్ఛ కోసం ఎంత ర‌క్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చ‌ల్ల‌క‌పోతే, అది నీ గుండెల్లో ఆత్మ గౌర‌వం పండిచ‌క‌పోతే, నువ్వు ఎప్ప‌టికీ మోచేతి అంబ‌లి తాగే బానిస‌ల్లాగా బ‌త‌కాల‌ని అనుకుంటే.. ఆ చిందించిన ర‌క్తానికి ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో’’శేషేంద్ర శ‌ర్మ‌గారు చెప్పారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తైతే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ల‌డం ఎంతో క‌ష్ట‌త‌రం. ఈరోజు ద‌ర్శ‌కులు నిర్మాత‌లు, పెద్ద‌లు.. అంద‌రూ థియేట‌ర్స్ బావుండాలని కోర‌కుంటున్నారు. క‌రోనా స‌మ‌యం వ‌ల్ల సినిమా ఇండ‌స్ట్రీ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది. సెన్సిటివ్ ప‌రిశ్ర‌మ . ఎవ‌రికైనా ఈజీ టార్గెట్ సినిమా ప‌రిశ్ర‌మ‌. 45 కిలోమీట‌ర్ల అత్యంత వేగంగా వెళుతూ ఆటోని ఓవ‌ర్‌టేక్ చేస్తూ కింద‌ప‌డిపోయాడు తేజు.. అనే క‌థ‌నాలు కూడా ఉన్నాయి. అంతే కంటే చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాలు చాలానే ఉన్నాయి. వై.ఎస్‌.వివేకానంద‌రెడ్డి ఎందుకు హ‌త్య చేయ‌బ‌డ్డారు అని క‌థ‌నం వేయండి. తేజ్ యాక్సిడెంట్ కాదు. ఓ నాయ‌కుడిపై కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులో కోడిక‌త్తితో దాడి జ‌రిగింది. అదేమైంద‌ని అడ‌గండి...తేజు యాక్సిడెంట్ గురించి కాదు. ల‌క్ష‌లాది పోడు భూముల్లో గిరిజ‌నులు వ్య‌వ‌సాయం చేసుకుంటూ వుంటే అది వారికి ద‌క్క‌డం లేదు. దాని గురించి మాట్లాడండి..తేజు యాక్సిడెంట్ గురించి కాదు. ఆరేళ్ల చిన్నారి చ‌రిత అన్యాయంగా, అకార‌ణంగా, అమానుషంగా హ‌త్య‌కు గురైతే అది వ‌దిలేసి.. తేజు యాక్సిడెంట్ గురించి క‌థ‌నం కాదు కావాల్సింది మ‌న‌కు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్స్ గురించి మాట్లాడి, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపు రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడ‌టం లేదో దాని మీద క‌థ‌నాలు చేయండి.. రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లు ఎందుకు న‌లిగిపోతున్నారు.. బోయ కుల‌స్థుల‌కు ఎందుకు రాజ‌కీయ ప్రాతినిధ్యం రావ‌డం లేదు... ఓ ఆడ‌పిల్ల బ‌య‌ట‌కు వెళితే క్షేమంగా ఎలా బ‌య‌ట‌కు రావాలో వంటి విష‌యాల‌పై క‌థ‌నాలు న‌డ‌పండి. మేం గౌర‌విస్తాం. 

సినిమా హీరోల మీద‌, సినిమా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారంటే వాళ్లు సాఫ్ట్ టార్గెట్స్‌. వాళ్లనేమైనా అంటే ఎవ‌రూ ఏమ‌న‌రు. రాజ‌కీయ నాయ‌కుల గురించి మాట్లాడ‌రు. ఇడుపుల పాయ‌లో నేల‌మాళిగ‌ల్లో డ‌బ్బులుంటాయ‌ని పోలీస్ వ్య‌వ‌స్థే చెబుతుంటుంది. ఎంత నిజ‌మో తెలియ‌దు కానీ.. దానిపై క‌థ‌నాలు న‌డ‌పండి. అవి న‌డిపితే, ఇళ్ల‌లో కొచ్చి కొడ‌తారు. అందుకే వాళ్ల గురించి మాట్లాడ‌రు. తేజ్ అమాయ‌కుడు క‌దా!. క‌ళ్లు తెర‌వ‌కుండా అక్క‌డ ప‌డున్నాడు క‌దా, హాస్పిట‌ల్లో. ఈరోజు వ‌ర‌కు తేజు ఇంకా క‌ళ్లు తెరిచాడో లేదో నేను కూడా చూడ‌లేదు. దీనిపై క‌థ‌నాలు కాదు కావాల్సింది. పొలిటిక‌ల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమా వాళ్ల గురించి కాదు మాట్లాడాల్సింది. అది క‌దా, స‌మాజానికి కావాల్సింది. సినిమాల థియేట‌ర్స్‌కు వెళ్లాల‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ థియేట‌ర్స్ తెలంగాణ‌లోనే ఉన్నాయి. ఆంధ్రాలో థియేట‌ర్స్ ఎక్క‌డున్నాయి. వైసీపీ నాయ‌కులు ఏమ‌నుకుంటున్నారంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఆపేసినా, అత‌నొచ్చిన చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆపేసినా, వాళ్లంద‌రూ భ‌య‌ప‌డి మ‌న కాళ్ల ద‌గ్గ‌ర‌కొచ్చేస్తార‌ని. కానీ వాళ్లు న‌న్ను త‌ప్పు అర్థం చేసుకున్నారు. సినిమాలో ద‌ర్శ‌కులు, హీరోలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకుంటున్నార‌ని అంద‌రూ అంటుంటారు. వాళ్ల‌కు చెప్పేదొక్క‌టే.. అరే! స‌న్నాసుల్లారా, ద‌ద్ద‌మ్మ‌ల్లారా! హీరోలు కానీ, ద‌ర్శ‌కులు కానీ, హీరోయిన్స్ కానీ, వీళ్లు లెక్క చెబుతారు. ఉదాహ‌ర‌ణ‌కు హీరోకు ప‌దికోట్లు పంపితే అందులో ఒక కోటి ట్యాక్స్ క‌ట్ చేసుకునే పంపుతారు. ప‌న్నులు పోగా.. ఆరున్న‌ర‌కోట్లు మిగులుతాయి. దీంట్లో వాళ్లు వ్య‌వ‌స్థ‌ను న‌డుపుకోవాలి. ఆ డ‌బ్బులు ఊరికే రాలేదు. దోచింది కాదు. వాళ్ల క‌ష్టం మీద వ‌చ్చిందే. వేల‌కోట్లు దోచేయ‌లేదు. దొంగ క్రాంటాక్టులు చేసి సంపాదించ‌లేదు. ఎంటర్‌టైన్ చేసి సంపాదిస్తున్నాం. డాన్సులేసో, కింద‌ప‌డో, మీద ప‌డో, ఒళ్లు విర‌గొట్టుకునో చేస్తున్నాం. బాహుబ‌లిలో ప్ర‌భాస్‌గారిలాగా కండ‌లు పెంచి కృషి చేస్తే, రానాగారిలాగా కండ‌లు పెంచి క‌ష్ట‌ప‌డితేనే అది బాహుబ‌లి అవుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌లా అద్భుత‌మైన డాన్సులు చేస్తే అప్పుడు డ‌బ్బులు ఇస్తారు. 

ఒక‌రోజులో ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. రామ్‌చ‌ర‌ణ్ లాంటి హీరో అద్భుత‌మైన స్వారీలు చేస్తే అప్పుడు డ‌బ్బులు ఇస్తారు. దేన్నైనా తెగేదాకా లాక్కండి అని అంద‌రికీ చెబుతున్నాను. సినీ ఇండ‌స్ట్రీ బాగుకోరే వారికిచెబుతున్న‌దొక్క‌టే. సినీ ఇండ‌స్ట్రీ న‌ష్ట‌పొతే, నేను డ‌బ్బులు వ‌దిలేస్తున్నాను. అలాగే ఎక్క‌డో మారుమూల న‌న్నెవ‌రూ గుర్తించ‌లేద‌ని బాధ‌ప‌డుతున్న కిన్నెర మొగ‌ల‌య్య‌ను గుర్తించి డ‌బ్బులిచ్చాను. అది నా సంస్కారం. మేమూ చేస్తాం. అవి కూడా చూడండి. మీరు దృష్టి పెట్టాల్సింది. అక్ర‌మ ఆర్జిత రాజకీయ నాయ‌కుల‌పైన‌.. సినిమా వాళ్ల మీద కాదు. మీరు ఒక‌సారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ముప్పై ఏళ్లు అధికారంలోకి ఉండాల‌నుకునే కోరిక‌లుంటాయి కానీ, వ్యాపారం చేసుకునేవాళ్ల‌కు ఉండ‌దా. హోట‌ల్ ఓ బ్రాంచీ పెడితేనె, మ‌రో బ్రాంచీ పెట్టాల‌నుకుంటాం. అందులో త‌ప్పేంటి. మీకు దిల్‌రాజుగారు న‌చ్చ‌లేదా.. పోటీగా మ‌రో ప‌ది మందికి అవ‌కాశం ఇవ్వండి. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వాళ్ల‌కు థియేట‌ర్స్ కోసం స్థ‌లాలు ఇవ్వండి. ఆర్థికంగా బ‌లంగా లేనివారికి థియేట‌ర్స్ ఇవ్వండి వాళ్లు వీళ్ల‌తో పోటీ ప‌డ‌తారు. అది మానేసి, మీకు డ‌బ్బులొద్దు..మాకు డ‌బ్బులొద్దంటారు. వెల్త్ క్రియేష‌న్ లేక‌పోతే ఎక్క‌డ్నుంచి డ‌బ్బులు వ‌స్తాయి. అది త‌ప్పా అని అడ‌గాల‌నుంది. కానీ ఎవ‌ర్నీ అడ‌గాలో తెలియ‌దు. నేను వెల్త్ క్రియేష‌న్ చేయ‌లేక‌పోతే మొగ‌ల‌య్య‌కు రెండున్న‌ర ల‌క్ష‌లు ఇవ్వ‌గ‌ల‌నా?  సైనికులకు కోటి రూపాయ‌లు, క‌రోనా నిధికి రెండు కోట్లు ఇవ్వ‌గ‌ల‌నా?  వెల్త్ క్రియేష‌న్ జ‌ర‌గాలిరా స‌న్నాసుల్లారా!. డ‌బ్బులు సంపాదించేస్తున్నారు అనే స‌న్నాసుల‌కు ఒక‌టే చెబుతున్నా. నా పేరు చెప్పి ఫిల్మ్ ఇండ‌స్ట్రీని చావ దొబ్బేస్తున్నారు. చిత్ర పరిశ్ర‌మ వైపు క‌న్నెత్తి చూడ‌కండి.. కాలిపోతారు జాగ్ర‌త్త‌. మీరు ల‌క్ష కోట్లు సంపాదించొచ్చు. మేం అడుక్కుతినాలా?  వైసీపీ నాయ‌కుల‌కు ఇండ‌స్ట్రీ వైపు చూడ‌కండి అని మీరు చెప్పాలేరా?  మాట్లాడండి. 

ఏం చేస్తారు? ఇది వైసీపీ రిప‌బ్లిక్ అని కాదు.. ఇండియ‌న్ రిప‌బ్లిక్ అని చెప్పండి. అధికారం ఉంది క‌దా.. అని పిచ్చి వేషాలు వేస్తే.. భ‌విష్య‌త్ ఉండ‌దు. దీనికి ఒక ఉదాహ‌ర‌ణ‌..లిబియా అధ్య‌క్షుడు గ‌డాఫీ.. అధికారం కోసం చాలా మందిని చంపాడు. ఇర‌వై ఏళ్ల త‌ర్వాత న‌డిరోడ్డులో మారుమూల‌, చిన్న కుర్రాళ్లు గ‌డాఫీని కొట్టి చంపేశారు. నాకు సినిమాల్లోకి, రాజీకీయాల్లోకి రావాల‌ని లేదు. కానీ ఖ‌ర్మ స‌రిగా లేదు. అందుక‌నే రాజకీయాల్లోకి ..సినిమాల్లోకి వ‌చ్చాను. సినిమా ప‌రిశ్ర‌మ‌కు కులాలు మ‌తాలు ఉండ‌వు. న్యూక్లియ‌ర్ ఫిజిక్స్‌లో యూనివ‌ర్సిటీ ఫ‌స్ట్ వ‌చ్చిన త్రివిక్రమ్ సినిమాల్లోకి వ‌చ్చాడు. హ‌రీశ్ శంక‌ర్ క‌రీంన‌గ‌ర్ వాస్త‌వ్యుడు. నాతో వ‌కీల్ సాబ్ సినిమా చేసిన శ్రీరామ్ వేణు ఎంబీసీ కులానికి చెందిన‌వాడు. ఆయ‌న తండ్రి ఓ టైల‌ర్‌. త‌న వ‌రంగ‌ల్‌కు చెందినవాడు. సురేంద‌ర్ రెడ్డి వ‌రంగల్‌వాడు. ఇప్పుడు రిప‌బ్లిక్ చేసిన దేవ‌క‌ట్టా కూడా బాగా చ‌దువుకున్న‌వాడే. ఎంత జ్ఞానం లేక‌పోతే, రిపబ్లిక్ సినిమా తీయ‌లేడు. ఓ సినిమా తీయ‌డం ఎంత క‌ష్ట‌మో దిల్‌రాజుగారిని అడ‌గండి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్రాంతీయ త‌త్వం, కుల‌త‌త్వం ఉండ‌వు. నేను కులం చూసి బంధాలు పెంచుకోలేదు. వ్య‌క్తిత్వం చూసి బంధాలు పెంచుకున్నాను. మొగిల‌య్య ద‌ళిత కులానికి చెందిన వ్య‌క్తి. నేను అభిమానించే ప్రొఫెస‌ర్ సుధాక‌ర్ ద‌ళిత కులానికి చెందిన వ్య‌క్తి. నాతో వ‌కీల్ సాబ్ సినిమా చేసిన శ్రీరామ్ ద‌ర్జీ కులానికి చెందిన‌వాడు. ఈరోజు భీమ్లానాయ‌క్ సినిమా చేస్తున్న సాగ‌ర్ రెడ్డి.. కులానికి చెందిన‌వాడు. అంద‌రూ బావుండాల‌ని కోరుకునేవాడిని. రాజ్యాంగం చాలా గొప్ప‌ది. ఇప్పుడు వైసీపీవాళ్ల‌ను అడిగితే ఓ రూల్ చూపిస్తారు. ఇలా చేస్తున్నామ‌ని అంటారు. నిజ‌మే అది రూల్‌గానే ఉండొచ్చు. కానీ అన్వ‌యించేది మీ నిబ‌ద్ద‌త‌ను బ‌ట్టి ఉంటుంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని వ్య‌క్తిగా చెబుతున్నాను. మీ మీద దాడి చేస్తున్న‌ప్పుడు మీరు బ‌లంగా మాట్లాడండి. 

మీకు హ‌క్కు ఉంది. మీరు దోపీడీలు, దొమ్మీలు చేయ‌డం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ అంటే దిల్‌రాజుగారో, అల్లు అర‌వింద్‌గారో, సురేష్‌బాబుగారో కాదు.. చాలా ఉంది. ఈ మ‌ధ్య హీరో నానిని అంద‌రూ తిడుతుంటే చాలా బాధేసింది. త‌నో సినిమా చేసుకుని, థియేట‌ర్స్ దొర‌క్క ఓటీటీకెళితే, థియేట‌ర్స్ య‌జ‌మానులంద‌రూ త‌న‌ని తిట్టారు. మీరు వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి మీద ప‌డితే త‌నేం చేస్తాడు. త‌న త‌ప్పేం ఉంది. పాతిక వేల మంది సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఆధాప‌డుతున్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ల‌క్ష మంది ఉంటారు. మీరు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కోపంతో సినిమా ఆపేస్తే .. ఇక్క‌డ ల‌క్ష మంది పొట్ట కొడుతున్నారు. మీకు నాతో గొడ‌వుంటే, నా సినిమాల‌ను ఆపేయండి. మా వాళ్ల‌ను వ‌దిలేయండి. చిరంజీవిగారెందుకు అలా బ‌తిమాల‌డుకుంటున్నారు? అని ఎవ‌రో అంటే.. అది ఆయ‌న మంచి మ‌న‌సు.. అలానే ఉంటారు. ఏం చేస్తాం. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అక్క‌ర‌కు రాని సోద‌ర భావ‌న ఎందుకు?  వెళ్లి దిబ్బ‌లో కొట్టుకోవ‌డానికా!. సినిమా టిక్కెట్ల‌ను ఆంధ్ర ప్ర‌భుత్వం ఎందుకు తీసుకోవాల‌నుకుంటుందంటే వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. చిత్ర ప‌రిశ్ర‌మ మీద వ‌చ్చే ఆదాయాన్ని బ్యాంకుల‌కు చూపించ‌వ‌చ్చు. లోన్స్ తెచ్చుకోవ‌చ్చు. దాని కోస‌మే టికెట్స్ అమ్మ‌కాన్ని తీసుకుంటున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం థియేట‌ర్స్ విష‌యంలో ఇబ్బంది పెడ‌తారు. చిరంజీవిగారిలాంటి వ్య‌క్తుల‌కు చెప్పండి ప్రాధేప‌డొద్ద‌ని. హ‌క్కుతో మాట్లాడ‌మ‌ని చెప్పండి. సినీ పెద్ద‌లు, సంపూర్ణ విద్వాంసులు బ‌య‌ట‌కు రండి. ఖండించండి. తప్ప‌ని చెప్పండి. చిత్ర ప‌రిశ్ర‌మ వైపు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీరు మార‌క‌పోతే, మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు తెలుసు’’ అన్నారు.

Pawan Kalyan Speech at Republic Pre release event:

Republic Pre release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ