మహేష్ బాబు సినిమాల్లో సూపర్ స్టార్ అయినా.. ఓ భార్యకి మంచి భర్త, ఓ తండ్రికి తగ్గ తనయుడు, పిల్లలకి ఆదర్శవంతమైన తండ్రి అనేలా కంప్లీట్ ఫ్యామిలీ మాన్ లా ఉంటాడు. సినిమా షూటింగ్స్ కి ఏ చిన్న గ్యాప్ వచ్చినా.. మహేష్ పిల్లలు, భార్య తో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తాడు. కూతురు సితార, కొడుకు గౌతమ్ తో మహేష్ ఆడుకుంటాడు, అల్లరి చేస్తాడు.. పిల్లలతో తనివితీరా ఎంజాయ్ చేస్తాడు మహేష్. వాళ్ళ బర్త్ డే లకి, స్పెషల్ డేస్ కి మంచి ట్రీట్ ఇవ్వడమే కాదు.. సోషల్ మీడియాలోనూ వాళ్ళ గురించి చాలా క్యూట్ గా స్పందిస్తాడు.
తాజాగా మహేష్ బాబు డాటర్స్ డే స్పెషల్ గా తన కూతురు సితార అందమైన క్యూట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ..7 billion smiles, and yours is my favourite! 😍 #DaughtersDay @sitaraghattamaneni అంటూ చాలా స్వీట్ గా తన కూతురు సితారకి డాటర్ డే విషెస్ చెప్పాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు డాటర్స్ డే స్పెషల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.