ప్రభాస్ భోజన ప్రియుడు అనే విషయాన్నీ తరుచు ఆయనతో సినిమాలు చేసే నటీనటులు, హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కి షేర్ చేస్తూనే ఉంటారు. ప్రభాస్ కి ఇష్టమైన సీ ఫుడ్ ఆయన నటించే సినిమాల సెట్స్ లో ఉండాల్సిందే. ప్రభాస్ మాత్రమే కాదు.. ఆయనతో వర్క్ చేసే వారికి ప్రభాస్ నుండి క్యారియర్లు వస్తుంటాయి. గతంలో అంటే సాహో టైం లో శ్రద్ద కపూర్ ప్రభాస్ ఆదిత్యానికి మైమరచిపోయింది. రీసెంట్ గా సలార్ సెట్స్ లో శృతి హాసన్ ప్రభాస్ వ్యక్తిత్వానికి ఆయన ఇచ్చిన లంచ్ పార్టీకి ఫిదా అంటూ ట్వీట్ చేసింది.
తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కి బాహుబలి మీల్స్ అంటూ ప్రభాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్నాడు. తనతో వర్క్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి ప్రభాస్ స్పెషల్ గా కొన్ని వంటకాలు తయారయి చేయించి ఆయన ఇంటికే పంపించడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ స్పెషల్‌గా బిర్యానీ, నాన్‌వెజ్ కర్రీ, ఖీర్ సిద్ధం చేయించి మరీ సైఫ్ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేసాడు. ఇక ఆ ఫుడ్ ట్రస్ట్ చూసిన సైఫ్ వైఫ్ కరీనా కపూర్ బాహుబలి బిర్యానీ పంపిస్తే.. అది ది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. రుచికరమైన భోజనాన్ని పంపించినందుకు థ్యాంక్యూ ప్రభాస్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.