ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్ తో యమా బిజీగా వున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సలార్ మూవీ షూటింగ్ కి హాజరయిన ప్రభాస్ కొన్ని రోజులుగా ముంబైలో ఆదిపురుష్ షూట్ కోసం అక్కడే ఉన్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 3D లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూట్ అక్కడ జోరుగా జరుగుతుంది. తాజాగా ఆదిపురుష్ లో రావణ్ పాత్రదారి సైఫ్ అలీ ఖాన్ కి ప్రభాస్ పంపిన బాహుబలి మీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక సీత గా కృతి సనన్ నటిస్తున్న ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి గెటప్ లో కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ హైదరాబాద్ లోనే ఉండి.. ఆదిపురుష్ షూట్ లో హాజరవడంతో.. ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ గా ఉన్నారు.
ఇక ఈ మధ్యన స్పెషల్ లుక్ కోసం ప్రభాస్ UK కి వెళ్ళబోతున్నట్లుగా టాక్ నడిచింది. అదేమోగాని ప్రభాస్ ప్రస్తుతం ముంబై లోనే ఆదిపురుష్ సెట్స్ లో ఉన్నాడు. ప్రభాస్ ఆదిపురుష్ సెట్స్ లో ఓం రౌత్ ఇంకా అక్కడ ఆదిపురుష్ సిబ్బందితో దిగిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో ఆ పిక్ ట్రెండ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక రాధేశ్యామ్ షూట్ కంప్లీట్ చేసేసిన ప్రభాస్ ఆ సినిమాని సంక్రాతి రేస్ లో ఉంచాడు. ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగష్టు కి డేట్ ఇచ్చారు. ఇక మిగిలింది సలార్ డేట్. అది కూడా ప్రశాంత్ నీల్ త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చెయ్యబోయే ప్రాజెక్ట్ కూడా నవంబర్ నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.