బిగ్ బాస్ సీజన్1 పూణే దగ్గరలోని లూనా వానలో సెట్ వేసి.. ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేసాడు. అప్పుడు బిగ్ బాస్ నుండి చిన్న విషయం కూడా లీక్ కాలేదు. కానీ సీజన్ 2 నుండి స్టిల్ ఇప్పుడు సీజన్ 5 వరకు హైదరాబాద్ నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వెయ్యడంతో.. బిగ్ బాస్ యాజమాన్యానికి బిగ్ బాస్ లీకులు ఇప్పటికి షాకిస్తూనే ఉన్నాయి. అలా అయితే ప్రేక్షకుల్లో మజా ఏముంటుంది. శని, ఆదివారాలు ఎపిసోడ్స్ ముందే లీకైపోయి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వివరాలు శనివారమే బయటికి వచ్చేస్తుంది.
గత రెండు వారాలుగా సరయు, ఉమాదేవి విషయంలో బిగ్ బాస్ నుండి ఎలా అయితే లీకులు బయటికి వచ్చాయో.. ఈ ఆదివారం అంటే ఈ రోజు ఎలిమినేట్ అయిన లహరి విషయం గత రాత్రి అంటే శనివారం రాత్రి 7 గంటలకే బయటికి వచ్చేసింది. ఆదివారం ఎపిసోడ్ షూట్ శనివారమే జరగడంతో లహరి ఎలిమినేట్ విషయం లీకైపోయింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రోజు బిగ్ బాస్ నుండి లహరి వెల్లిన విషయం రాత్రే తెలిసిపోయింది. అంటే ఇక ఈ రోజు టివిలో చూసి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనే క్యూరియాసిటీ ఈ బిగ్ బాస్ లీకులు లాగేసుకున్నాయి. అసలు ఆదివారం ఎపిసోడ్ శనివారమే బయటికి లీకైతే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది బాస్ కాస్త ఆలోచించు.