Advertisementt

బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్న మెగా హీరో

Mon 27th Sep 2021 05:44 PM
vaishnav tej,love story movie,naga chaitanya,sai palalvi,sekhar kammula,mega hero vaishnav tej  బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్న మెగా హీరో
This Mega hero missed Love story బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్న మెగా హీరో
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ ప్రేక్షకుల అంచనాలు మించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ వీకెండ్ లో లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీసుని షేక్ చేసింది. సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులని థియేటర్స్ రప్పించేలా చేసింది. అదే లెవెల్ హిట్ కొట్టడంతో మేకర్స్ హ్యాపీ. అయితే ఈ సినిమా ఫస్ట్ నాగ చైతన్య చెయ్యాల్సింది కాదట. ఈ కథ శేఖర్ కమ్ముల మెగా హీరో ఒకరికి వినిపించారట.

ముందు లవ్ స్టోరీ కథని కొత్తవాళ్లతో మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల తర్వాత అది బాగా రావడం లేదని.. లవ్ స్టోరీ కథని పంజా వైష్ణవ తేజ్ కి వినిపించగా.. లవ్ స్టోరీ కథ నచ్చి, శేఖర్ కమ్ముల తో సినిమా చెయ్యాలని ఉన్నా.. అప్పటికే ఉప్పెన సినిమా ఒప్పుకోవడం, ఉప్పెన కూడా లవ్ స్టోరీ పోలిన కథే కావడంతో వైష్ణవ తేజ్ ఆ కథని వదులుకోవడంతో.. ఇప్పుడు ఆ హిట్ నాగ చైతన్య ఖాతా లో పడింది. లవ్ స్టోరీ కథ విన్న వెంటనే నాగ చైతన్య ఒప్పేసుకోవడం, ఆ కథకి నాగ్ నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆ సినిమా త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకుని.. కరోనా వలన రిలీజ్ ఆగినా.. చివరికి థియేటర్స్ సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. సో అలా వైష్ణవ తేజ్ లవ్ స్టోరీ హిట్ ని మిస్ చేసుకున్నాడు. 

This Mega hero missed Love story:

Vaishnav Tej Missed Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ