Advertisementt

బిగ్ బాస్ 5: క్షమాపణ చెప్పిన యాంకర్ రవి

Tue 28th Sep 2021 11:03 AM
anchor ravi,bigg boss 5,bigg boss telugu,ravi admitted the mistake,monday nominations  బిగ్ బాస్ 5: క్షమాపణ చెప్పిన యాంకర్ రవి
Bigg Boss 5: Anchor Ravi apologizes బిగ్ బాస్ 5: క్షమాపణ చెప్పిన యాంకర్ రవి
Advertisement
Ads by CJ

గత వారం లేడీ కంటెస్టెంట్ ప్రియా మీరు అబ్బాయిలతో బిజీగా వుంటున్నారని లహరిని నామినేట్ చేస్తున్నా అన్నమాటకి యాంకర్ రవి ప్రియపై ఫైర్ అయ్యాడు. ప్రియా జన్యూన్ గా రవి మీరు చెప్పిన మాటలే నేను నామినేషన్స్ లో చెప్పాను అన్నా నేను ఆ వర్డ్ అనలేదు.. సింగిల్ మ్యాన్ అనలేదు అంటూ రవి వాళ్ళ అమ్మ మీద కూడా ఒట్టేసేసాడు. కానీ శనివారం నాగార్జున యాంకర్ రవి ముసుగు తీసేసి లహరికి నిజాన్ని చూపించాడు. దానితో అక్కడ లహరి, ప్రియా సేఫ్ అవ్వగా.. రవి అడ్డంగా దొరికిపోయాడు. ప్రియా తో రవి లహరి విషయాన్ని మాట్లాడాడు. కానీ కాదన్నాడు. ఇక ఆదివారం అనూహ్యంగా లహరి ఎలిమినేట్ అవడంతో అందులో తన పాత్ర ఉందని రవి ఫీల్ అయ్యాడు. లహరి తన వలనే ఎలిమినేట్ అయినట్లుగా బాధపడ్డాడు.

ఇక సోమవారం అంటే గత రాత్రి ఎలిమినేషన్స్ ప్రక్రియలో విశ్వ - నటరాజ్ మాస్టర్ కి, సన్నీ - కాజల్ కి మధ్యన చిన్నపాటి గొడవ జరిగింది. తర్వాత రవి నామినేట్ చెయ్యడానికి  వచ్చినప్పుడు నేను ముగ్గురికి క్షమాపణ చెప్పాలి.. మా అమ్మ మీద ఒట్టు వేసి.. నేను అనలేదు అన్నమాట అన్నాను.. సో అమ్మకి క్షమాపణ, అలాగే ప్రియా అక్క మీకు సారి చెబుతున్నా, నా వలన లహరి ఎలిమినేట్ అయ్యింది అనే బాధను 2 డేస్ నుండి మోస్తున్నాను అంటూ యాంకర్ రవి ఇంటి సభ్యుల ముందు వారి ముగ్గిరికి క్షమాపణ చెప్పాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ తో మీరు గుంటనక్క అన్నది నన్నే అంటూ రవి గొడవ కూడా పడ్డాడు. రాత్రి నామినేషన్స్ లో ఈ వారం ప్రియా, రవి, సన్నీ, కాజల్, నటరాజ్ మాస్టర్, ఆని మాస్టర్, లోబోలు నామినేషన్స్ లోకి వెళ్లారు. 

Bigg Boss 5: Anchor Ravi apologizes:

Anchor Ravi admitted the mistake he made during Monday nominations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ