అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో రకరాల న్యూస్ లు ప్రచారం లోకి వచ్చాయి. క్రిష్ట్మస్ కి బాలీవుడ్ మూవీస్ రిలీజ్ లు ఉన్నాయి.. సో పుష్ప ని క్రిష్ట్మస్ కి రిలీజ్ చేసి రిస్క్ తీసుకోలేరు.. కాబట్టి పుష్ప రిలీజ్ డేట్ మారినా మారొచ్చనే ఊహాగానాలు రేజ్ అయ్యాయి. అంతలోనే పుష్ప యూనిట్ పుష్ప నుండి అదిరిపోయే అప్ డేట్ ని షేర్ చేసింది. పుష్ప సినిమా నుండి ఇప్పటివరకు పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్, ఫారెస్ట్ ఆఫీసర్ గా విలన్ ఫహద్ ఫాజిల్ లుక్ ని రివీల్ చేసింది. ఇక పుష్ప టీజర్ లో రష్మిక మందన్న లంగావోణీ లుక్ లో కనిపించింది.
అఫీషియల్ గా రష్మిక మందన్న లుక్ బయటికి రాలేదు. ఇక తాజాగా Meet our #Pushpa Love tomorrow at 9:45 AM ♥️ .. రేపు ఉదయం 9.45 నిమిషాలకు పుష్ప లవ్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా.. రా & ఇంటెన్స్ లుక్ లో రష్మిక మందన్న లుక్ కి అంతా సిద్ధం అంటూ పుష్ప యూనిట్ అప్ డేట్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ ఫాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టేసారు. పుష్ప హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ తగ్గేదేలే అంటూ హడావిడి చేస్తున్నారు. సో రేపు ఉదయం పుష్ప రాజ్ లవర్ రష్మిక లుక్ రాబోతుంది అన్నమాట.