Advertisementt

క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత

Wed 29th Sep 2021 11:39 AM
samantha akkineni,samantha,naga chaitanya,nagarjuna,akkineni family,chaitu - samantha divorce  క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత
Samantha confusing without clarity క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత లు విడిపోతున్నారంటూ.. అక్టోబర్ 7 న ఆ విషయమై ఫుల్ క్లారిటీ రాబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ విడాకుల మేటర్ ఫ్యామిలీ కోర్టులో ఉంది అని, త్వరలోనే వాళ్ళకి విడాకులు మంజూరు అవ్వబోతున్నాయని అంటున్నారు. మరోపక్క మీడియా కి నాగ చైతన్య ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో నాగ చైతన్య పర్సనల్ విషయాలేమి చెప్పలేదు. మరొప్పక్క సమంత తాను ఆన్ లైన్ వస్త్ర దుకాణం సాకి మొదలు పెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అయితే సమంత కి ముందే తెలుసు ఈ అభిమానుల సెషన్ లో తనకి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అనేది. అందుకే చాలా తెలివిగా సమాధానాలు చెప్పింది. 

అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పిన సమంత ఓ అభిమాని మీరు ముంబై షిఫ్ట్ అవుతున్నారటగా అని అడగగా.. ఇలాంటి రూమర్స్ ఎందుకొస్తున్నాయో తెలియదు కానీ.. నాకు హైదరాబాద్ అంటేనే ఇష్టం. నేను హైదరాబాద్ ని వదిలి ఎక్కడికి పోను అంటూ.. ఇలాంటి గాసిప్స్ ఎందుకు సృష్టిస్తారో అంటూ విడాకులు మేటర్ కూడా ఓ రూమరే అని చెప్పకనే చెప్పినా.. ఈ మధ్యన అక్కినేని ఫ్యామిలీ పార్టీ, లవ్ స్టోరీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లోను సమంత అస్సలు కనిపించలేదు. కనీసం లవ్ స్టోరీ సక్సెస్ పై ఓ ట్వీట్ కూడా వెయ్యలేదు. దానితో మళ్ళీ అభిమానులు సమంత ఇచ్చిన సమాధానముతో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 

Samantha confusing without clarity:

Samantha chit chat with fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ