బిగ్ బాస్ 5 లో శ్రీరామ చంద్ర - మానస్ మధ్యన పొసగడం లేదనేది.. రెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ విషయంలో జరిగిన గొడవ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో బరువు తగ్గు కెప్టెన్సీ పట్టు అంటూ హౌస్ మేట్స్ నుండి ఫుడ్ మొత్తం దొంగిలించి.. బరువు పెరగాలనుకునే వారికీ మాత్రమే ఫుడ్ పంపుతూ.. మిగతా వారికి కఠిన శిక్ష పెట్టింది బిగ్ బాస్. ఇక మానస్ - సన్నీ, శ్రీరామ చంద్ర - హమీద, రవి - విశ్వ వాళ్ళు ఫుడ్ తినకుండా టాస్క్ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. లోబో మాత్రం ఫుడ్ కి ఆగలేక చెత్త కవర్ వెతుకుతుంటే యాంకర్ రవి లోబో ని అక్కడి నుండి తీసుకొచ్చేసాడు. ఇక తర్వాత మటన్ బిర్యానీ అవి వస్తే.. ప్రియా, కాజల్, లోబో వీళ్లంతా బిర్యానీ లాగించేసినా సన్నీ, శ్రీరామ చంద్ర ఇంకొంతమంది తినరు.
ఇక ఈ రోజు కూడా ఆ టాస్క్ కంటిన్యూ అవుతుంది. బరువు తగ్గిన వారే కెప్టెన్సీ టాస్క్ కి అర్హులు అంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ బరువు ని చూస్తున్నారు. అయితే ఒకరు కెప్టెన్ అవడం కోసం మరొకరు త్యాగాలు చేసే ప్రాసెస్ లో సన్నీ గత వారం వాడు కెప్టెన్ అయ్యాడుగా.. నేను వాడిని అడుగుతా.. ఇక శ్రీరామ్ రేస్ లో ఉంటే నేను గ్యారెంటీగా పోటీ పడతా అంటూ శ్రీరామ్ మీద ఉన్న కోపాన్ని చూపించాడు మానస్. కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది అంటూ శ్రీరామ్ హమీదాతో డిస్కస్ చేస్తాడు. అంటే ప్రమోలోనే కాదు.. మానస్ మనసులో శ్రీరామ్ మీద ఇంకా కోపం ఉన్నట్లుగా అర్ధమవుతుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో లేడి కంటెస్టెంట్స్ చిక్కులు విప్పు - తాడు =కట్టు అనే టాస్క్ లో సిరి, శ్వేతలు పోటాపోటీగా కనిపిస్తున్నారు.. మరి ఫైనల్ గా వచ్చే వారం కెప్టెన్ ఎవరో చూడాలి.