అఖిల్ - పూజ హెగ్డే కలయికలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ దసరా స్పెషల్ గా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీస్ ప్రమోషన్స్ ని మేకర్స్ చాలా స్పీడు గా మొదలు పెట్టారు. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సాంగ్స్, టీజర్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తుంది. అఖిల్ స్టైలిష్ గా కనిపిస్తుంటే.. పూజ హెగ్డే గ్లామర్ సినిమాకే హైలెట్ అనేలా ఉంది. అఖిల్ - పూజ హెగ్డే కపుల్.. ఫుల్ రొమాంటిక్ గా కనిపిస్తుంది.
ఇక ట్రైలర్ లోకి వెళితే.. మన లైఫ్ పార్టనర్ తో కలసి వేల రాత్రులు పడుకోవాలి. వందల వెకేషన్స్ కి వెళ్ళాలి. అంతకుమించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు అంటూ పూజ హెగ్డే వాయిస్ తో ట్రైలర్ ని మొదలు పెట్టారు. ఓ NRI కుర్రాడు కి లైఫ్ లో 50% కెరీర్ 50% పెళ్లి.. మ్యారేజ్ లైఫ్ బావుండాలనుంటే.. కెరీర్ బావుండాలనుకుంటున్నాడు. ఇక పెళ్లి చేసుకోవడానికి అని చాలామంది అమ్మాయిలని చూడడానికి వెళ్తాడు అఖిల్. పెళ్లి చూపుల ఎపిసోడ్స్ అన్ని కామెడీ ట్రాక్ లో చూపించారు. పూజ హెగ్డే లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక అఖిల్ లో రావాల్సిన మార్పులు రావడం, అఖిల్ - పూజ హెగ్డే సీన్స్, మురళి శర్మ తో అఖిల్ ఫామిలీ ఫైట్.. అన్ని ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ కథా చిత్రం లా కనిపించింది. అఖిల్ లుక్స్, పూజ హెగ్డే గ్లామర్ లుక్స్, ఫారియా, ఈషా రెబ్బ లు అఖిల్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన అమ్మాయిల్లా అందరూ ఆకట్టుకునేలా కనిపించారు.
ట్రైలర్ చివర్లో.. అఖిల్ మేకల మంద తో నడుస్తూ.. లోకం సర్దుకుపో అంటుంది. మందని వదిలి. కొత్త దారి వెతికి.. నేను వెళ్తున్నా. మీరూ రండి.. అంటూ ట్రైలర్ ని ఎండ్ చేసారు.మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.