బాలకృష్ణ లెజెండ్ ద్వారా పవర్ ఫుల్ విలన్ అవతారమెత్తిన జగపతి బాబు.. అప్పటి నుండి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో సాగిపోతుంది. బోయపాటి జగపతి బాబు కి లెజెండ్ లో విలన్ గా ఓ మంచి పాత్ర ఇచ్చి అయన కెరీర్ ని మలుపు తిప్పాడు. మరి ఇప్పుడు అఖండ ద్వారా మరో హీరో విలన్ గా రాబోతున్నాడు. హీరో శ్రీకాంత్ అఖండ లో బాలయ్య ని ఢీ కొట్టబోయే విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. మరి హీరో శ్రీకాంత్ బాలయ్య ముందు విలన్ గా ఎలా కనిపిస్తాడో అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు, నందమమూరి అభిమానులు ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ అఖండ మూవీ విషయాలను ఓ సినిమా ఈవెంట్ లో మట్లాడుతూ..
అఖండ సినిమాలో విలన్ గా తెరపై నేను ఎలా కనిపిస్తాననేది ఎవరూ ఊహించలేరు. నా పాత్ర వేషధారణ .. ఆ పాత్ర స్వభావం అలా ఉంటాయి. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారు. ఆ పాత్ర కోసం ముంబై నుంచి డిజైనర్లను తీసుకొచ్చారు. రగ్డ్ గెటప్‌లో ఉంటాను. అంత దుర్మార్గంగా ఆ పాత్ర ఉంటుంది. నాకు మాత్రం చాలా వైవిధ్యభరితమైన పాత్రలో చేశాననే సంతృప్తి కలిగింది. మహిళా ప్రేక్షకులు మళ్లీ నన్ను తిడతారేమో అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా అఖండ నుండి నా లుక్ రివీల్ చేస్తారా? లేదా నేరుగా సినిమాలోనే చూపిస్తారా? అన్నది మాత్రం నాకు తెలియదు అంటూ హీరో శ్రీకాంత్ తన విలన్ పాత్ర అఖండ లో ఎలా ఉండబోతుందో చెప్పేసాడు.