Advertisementt

పోసానిని క్షమించేసిన పవన్

Sat 02nd Oct 2021 11:52 AM
pawan kalyan,posani krishna murali,pawan vs posani  పోసానిని క్షమించేసిన పవన్
Pawan forgives Posani? పోసానిని క్షమించేసిన పవన్
Advertisement
Ads by CJ

పవన్ రిపబ్లిక్ వేడుకలో ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు నటుడు పోసాని కృష్ణమురళి .. పవన్ కళ్యాణ్ పై లైవ్ లోనే ఫైర్ అయ్యాడు. పోసాని పవన్ కళ్యాణ్ ని సైకో అని, వాళ్ళ అమ్మని, పవన్ కూతురుని కూడా ఈ వివాదంలోకి లాగేసాడు. తనకి ఏం జరిగినా పవన్ దే బాధ్యత అంటూ మరో ప్రెస్ మీట్ పెట్టి పోసాని, పవన్ ని దూషించాడు. అయినా పవన్ కళ్యాణ్ వైసిపి నేతలని గ్రామ సింహాలని అన్నారు కానీ పోసానిని ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరోపక్క పవన్ ఫాన్స్ ఆగ్రహానికి పోసాని గురయ్యాడు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ని పోసాని పరుష పదజాలంతో దూషించిన కారణంగా పోసానిని ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యాలనే నిర్ణయంలో ఉన్నట్లుగా టాక్.

అయితే నిన్న పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటీ ఐనా నేపథ్యంలో పోసానిని ఇండస్ట్రీ బ్యాన్ చేసే విషయం మాట్లాడగా.. పవన్ వారిని వారించినట్లుగా తెలుస్తుంది. పోసాని ని ఎవరూ బ్యాన్ చెయ్యవద్దని.. పవన్ వారిని కోరినట్లుగా తెలుస్తుంది. మరోపక్క నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా పవన్ కి వ్యతిరేఖంగా మారారు అన్న నేపథ్యంలో నిర్మాతలు పవన్ తో భేటీ అవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రస్తుతం కరోనా టైం లో తాము ఏపీ ప్రభుత్వంతో కానీ.. ఎవరితో అని వైరి పెట్టుకోలేమని పవన్ కి చెప్పగా.. రాజకీయాలు వేరు, ఇండస్ట్రీ సమస్యలు వేరు.. పాలిటిక్స్ తో ఇండస్ట్రీకీ సంబంధం లేదని పవన్ నిర్మాతలతో చెప్పినట్లుగా తెలుస్తుంది. 

Pawan forgives Posani?:

Pawan Kalyan forgives Posani Krishna Murali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ