కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గడంతో.. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. దానితో అన్ని భాషల సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా బాలీవుడ్ లో చాలా సినిమాల డేట్స్ ని ఒక్కో వారం గ్యాప్ లో ఇచ్చేసారు. ఇక టాలీవుడ్ లో అయితే గత రెండు నెలలుగా సినిమాల హడావిడి థియేటర్స్ దగ్గర కనిపిస్తుంది. అయితే తాజాగా రాజమౌళి పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో అంటే జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటూ ప్రకటించారు. సంక్రాంతి సినిమాలకు ఎలాంటి భయం లేకుండా ఓ వారం ముందే ఆర్.ఆర్.ఆర్ వచ్చేస్తుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యింది. రాజమౌళి అలియా భట్ ని ఇరికించేసాడు.
ఎందుకంటే ఆలీకి భట్ మెయిన్ లీడ్ లో బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూభాయ్ కతీయవాడి కూడా జనవరి 6 న రిలీజ్ అవుతుంది. పూర్తిగా డిఫరెంట్ కేరెక్టర్స్ చేసిన అలియా భట్ తనకి తానే బాక్సాఫీసు ఫైట్ కి దిగబోతుంది. ఆర్.ఆర్.ఆర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అలియా భట్ గంగూభాయ్ పై పడడం ఖాయం. హిందీ మర్కెట్ లో రాజమౌళి క్రేజ్ గురించి బాహుబలి తేల్చేసింది. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తనపై ఓ రికార్డ్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ ముందు గంగూభాయ్ ఎలా నిలబడుతుంది.. ఎలా నిలుస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ లో సీత గా పద్దతిగా.. గంగూభాయ్ కతీయవాడిలో కాస్త రఫ్ కేరెక్టర్ లో కనిపించబోతుంది