గత నెల 10 వ తారీఖు, వినాయక చవితి రోజున రోడ్డు యాక్సిడెంట్ లో గాయాలపాలై కోమాలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో ఉన్నాడు. షోల్డర్ బోన్ సర్జరీ, ఓకల్ కార్డు సర్జరీ తరవాత అపోలో డాక్టర్స్ సాయి తేజ్ ఆరోగ్యం పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడన్నారు. కానీ మెగా హీరోలైన చిరు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు సాయి తేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
తాజాగా సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ సాయి ధరమ్ హెల్త్ అప్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు. గత రాత్రి కొండపొలం ఆడియో వేడుకలో వైష్ణవ తేజ్.. అన్న సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై మట్లాడుతూ సాయి తేజ్ కోలుకుంటున్నాడని, ఓ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది అని, ప్రస్తుతం సాయి తేజ్ కి ఫిజియో థెరపీ జరుగుతున్నట్లుగా చెప్పాడు. దానితో సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.