గత నెలన్నర రోజులుగా అక్కినేని ఫ్యామిలీ నుండి సమంత దూరమైపోతుంది అనే సంకేతాలు ఇస్తూ సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసి జస్ట్ S అని ఉంచిన సమంత.. నిన్న నాగ చైతన్యుతో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడమే కాదు.. ఆతర్వాత తన తల్లి తనకి చెప్పింది.. నిజమైన ప్రేమ అంటే ఏమిటో అంటూ ఏవేవో ట్వీట్స్ చేసుకుంటూ కూర్చుంది. ఇక నాగ చైతన్య తో సమంత అసలు ఎందుకు విడిపోయిందో అర్ధం కాక అక్కినేని అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా రకరకాల కారణాలు వెదుకుతున్నారు.
ఈలోపు సమంత తన ట్విట్టర్ హ్యాండిల్ లో S అన్న పదం మార్చేసి సమంత రౌత్ ప్రభు అంటూ పెట్టేసింది. నెల క్రితం అక్కినేని ని తొలగించి S ఉంచుకున్న సమంత.. తాజాగా S తొలగించి.. చివరికి సమంత రౌత్ ప్రభు గా పేరుని మార్చేసింది. నాగ చైతన్య తో విడిపోతున్నామనుకున్నాక సమంత S గా మారిపోతే.. విడిపోయామని చెప్పాక రౌత్ ప్రభుగా మారిపోయింది. నాగ చైతన్య తో సమంత కున్న విభేదాలేమిటో కానీ.. సమంత అక్కినేని ఫ్యామిలీ నుండి దూరం అవడం మాత్రం ఫాన్స్ భరించలేకపోతున్నారు.