బాహుబలి మూవీ ప్రభాస్ ని ఎక్కడో నించోబెట్టింది. బాహుబలి తర్వాత సాహో పాన్ ఇండియా ఫిలిం ఫలితం ఎలా ఉన్నా.. ప్రభాస్ రాధేశ్యామ్ తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. జనవరి 14 2022 సంక్రాంతి స్పెషల్ గా రాధేశ్యామ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ పాన్ ఇండియా ఫిలిం, ఆదిపురుష్ పాన్ ఇండియా ఫిలిమ్స్ ని పారలాల్ గా చేస్తున్నారు. రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. ఈలోపు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె కూడా రెగ్యులర్ షూట్ ని త్వరలోనే మొదలు పెట్టుకోబోతుంది. ఇలా మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీ కాబోతున్న ప్రభాస్ ఇప్పుడు ఫాన్స్ కి మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేసాడు.
అది తన 25 వ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చెయ్యబోతున్నాడు. Prabhas25 మూవీ అనౌన్సమెంట్ అక్టోబర్ 7 న ఉండబోతుంది అంటూ అప్ డేట్ ఇచ్చారు. Prabhas25 అనౌన్సమెంట్ రాబోతుంది.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్న టీం.. వివరాలను ప్రకటించకుండా.. జస్ట్ Prabhas25 అనౌన్సమెంట్ అంటూ అప్ డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అక్టోబర్ 7 ప్రభాస్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్ తన 25 వ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ తో చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో పక్క ప్రభాస్ 25 ఫిలిం ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నాడనే న్యూస్ కూడా ఉంది. మరి ఈ సస్పెన్స్ పోవాలంటే మరో 2 డేస్ వెయిట్ చెయ్యాల్సిందే.