Advertisementt

షారుఖ్ కొడుక్కి బెయిల్ కష్టమే

Mon 04th Oct 2021 04:50 PM
shah rukh khan,aryan,court,bail,shah rukh khan son aryan  షారుఖ్ కొడుక్కి బెయిల్ కష్టమే
Shah Rukh son bail hearing will be held today afternoon షారుఖ్ కొడుక్కి బెయిల్ కష్టమే
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు టాప్ సెలబ్రిటీస్ మెడకి చుట్టుకున్నాయి. ముంబై క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో ఎన్ సీబీ అధికారులకి అడ్డంగా దొరికిపోయిన వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉండడంతో అందరిని షాక్ కి గురి చేసింది. నిన్న క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్న ఎన్ సీబీ అధికారులు.. 18 గంటల విచారణ తర్వాత ఆర్యన్ ని అరెస్ట్ చేసారు. ఇక షారుఖ్ కొడుకుగా అర్యాన్ ఖాన్ అరెస్ట్ అవడంతో కన్నీటి పర్యంతమైనట్లుగా వార్తలు రావడం.. సల్మాన్ ఖాన్ షారుక్ ఇంటికి వెళ్లి ఓదార్చడం అన్ని చూసాం.

ఇక నేడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇప్పించడానికి షారుఖ్ ఖాన్ లాయర్లు శతవిధాలా ప్రయత్నించినా.. పని జరిగేలా కనిపించడం లేదు. ఆర్యన్ ఖాన్ ఫోన్ లో డ్రగ్స్ కి సంబంధించిన  వాట్స్ ఆప్ చాటింగ్స్, అలాగే ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నప్పుడు అతని దగ్గర డ్రగ్స్ దొరకడంతో.. ఆర్యన్ ఖాన్ ని తమ కష్టడికి ఇవ్వాలని, అక్టోబర్ 13 వరకు ఆర్యన్ ఖాన్ ని కష్టడి కోరుతూ ఎన్ సీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఇక ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ గుర్తించడం, అతని ఫోన్ లో డ్రగ్స్ పెడ్లర్స్ కి సంబందించిన కీలక అధరాలు ఉండడంతో.. ఆర్యాన్ ఖాన్ కి బెయిల్ రావడం కష్టం అంటున్నారు. 

 

Shah Rukh son bail hearing will be held today afternoon:

Shah Rukh Khan Son Aryan Appears In Court In Drugs On Cruise Case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ