సమంత పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత కూడా టాప్ హీరోయిన్. సమంత చేతిలో ఉన్న బ్రాండ్స్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ చేతిలో లేవు. ఇప్పటికి సమంత సౌత్ క్వీన్. బాలీవుడ్ లోను ఫ్యామిలీ మ్యాన్ 2 తో అదరగొట్టేసింది. తాజాగా సమంత భర్త నాగ చైతన్య తో విడిపోయింది. సమంత - నాగ చైతన్య లు విడిపోయి విడాకులు తీసుకోవడానికి అనేకారణాలు.. రూమర్స్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంత - నాగ్ చైతన్య విడిపోవడానికి ఏకైక కారణం, ఆమె డబ్బు. అలాగే ఆమెని తల్లి అవ్వకుండా చేసేందుకు జరిగిన కుట్ర అంటూ నటి మాధవి లతా షాకింగ్ కామెంట్స్ చేసారు.
సమంత చాలా మంచి అమ్మాయి. ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం.. ఆమె ఒక్కటే కాదు. ఆమె రెండు చేతుల సంపాదిస్తుంది. 30 ఏళ్లకే తల్లి అవ్వాలని ఉంది అంటూ ప్రదీప్ షో లో చెప్పిన సమంత కి తల్లి అయ్యేందుకు అనుమతి దొరకలేదు. తల్లి అయితే ఆమె గ్లామర్ పోతుంది అని ఫ్యామిలీ భయాపడింది. అలాగే సమంత ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా అనేకమంది పిల్లలకి హర్ట్ ఆపరేషన్స్ చేయించేది. ఆమె ఏ షాప్ ఓపెనింగ్ కి వెళ్లినా దానికి వచ్చే మనీ ప్రత్యుష ఫౌండేషన్ కి నేరుగా వెయ్యాలని చెప్పేవారు. అయితే కోట్లు సంపాదించే సమంత కి పాకెట్ మనీ ఇచ్చేసారు. ఆమెని కేవలం డబ్బు సంపాదించే యంత్రంగానే చూసారు తప్ప మనిషిగా చూడలేదు. ఆమె షాప్ ఓపెనింగ్స్ వెళ్లే డబ్బు కూడా ఆమె ఖాతాలోకి వెళ్ళకపోవడంతో.. ఆ విషయంలో ఆమె చాలా బాధపడింది.
ఇవన్నీ రూమర్స్ కాదు.. ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. సామ్ సన్నిహితులే నాకు ఈ విషయం చెప్పారంటూ మాధవి లతా షాకింగ్ కామెంట్స్ చేసింది.