Advertisementt

రెండేళ్లలో ఐదు అంటున్న ప్రభాస్

Wed 06th Oct 2021 10:14 AM
prabhas,pan india movies,salaar,radheshyam,adipurush,nag ashwin project k,prabhas25  రెండేళ్లలో ఐదు అంటున్న ప్రభాస్
Prabhas says five movies in two years రెండేళ్లలో ఐదు అంటున్న ప్రభాస్
Advertisement
Ads by CJ

ఒకపుడు చాలా కూల్ గా లేజిగా సినిమాలు చేసే ప్రభాస్ బాహుబలి దెబ్బకి కాస్త మారాడు. అయినా సాహో తో రెండేళ్లు అభిమానుల ముందుకు రాలేదు. ఆ తర్వాత రాధేశ్యామ్ పరిస్థితి అంతే. కరోనా కరోనా అంటూ రాధేశ్యామ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. చివరికి వచ్చే ఏడాది సంక్రాంతి కి రాధేశ్యామ్ రిలీజ్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాడు. ఆ మూవీ అసలైతే 2022 ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ.. ఇప్పుడు అది ఏ డిసెంబర్ కో మారినా మారొచ్చు. మరో పక్క ఓం రౌత్ తో ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది అంటే ఆగష్టు 11 2022 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో ప్రభాస్ ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

మరి 2023  కూడా మనదే అంటున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీ గా మొదలు కాబోతున్న ప్రాజెక్ట్ కే 2023 లో రిలీజ్ చెయ్యబోతున్నాడు ప్రభాస్. మరి రేపు 7 వ తేదీన Prabhas25 వ మూవీ ఎనౌన్సమెంట్ రాబోతుంది. ఈ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ కానీ, టాలీవుడ్ నుండి ఒకరిద్దరి డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.. వారు కానీ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా 2023 లోనే రిలీజ్ కాబోతుంది. మరి 2022, 2023 ఈ రెండేళ్లలో ప్రభాస్ నుండి ఏకంగా ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని తెలిసి ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Prabhas says five movies in two years:

Prabhas Pan India Movies list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ