దగ్గుబాటి మనవడు, అక్కినేని వారసుడు నాగ చైతన్య టాప్ హీరోయిన్ సమంత తో విడాకుల వరకు వెళ్లడం.. అక్కినేని, దగ్గుబాటి ఫామిలీస్ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే సమంత.. చై ని వివాహమాడాక అక్కినేని, దగ్గుబాటి ఫామిలీస్ లో అంత త్వరగా కలిసిపోయింది. నాగ చైతన్య - సమంత విడిపోయామని ప్రకటించగానే.. నాగార్జున వారు విడిపోవడం దురదృష్టకరమని స్పందిస్తే.. సమంత తండ్రి.. వారిది చూడచక్కని జంట, కానీవారు విడిపోయారని తెలిసి నా మైండ్ అంతా సూన్యమయ్యింది అంటూ స్పందించారు. ఇక సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితం ఎంత గోప్యంగా ఉన్నా.. మీడియా చెవికి చిక్కితే అది పబ్లిక్ అవ్వడం అనేది తరచూ చూస్తూనే ఉన్నాం. చై - సామ్ విడిపోయామని చెప్పగానే మీడియాలో ఆ జంటపై అనేకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తాజాగా వెంకటేష్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసారు. అది ఎవరిని ఉద్దేశించిందో తెలియదు కానీ.. నాగ చైతన్య - సమంత విడిపోయాక వెంకీ స్పందించడంతో.. ఇప్పుడు ఆ ట్వీట్ చైతు విడాకుల మేటర్ మీదే అనే చర్చ జరుగుతుంది. వెంకటేష్ ట్విట్టర్ వేదికగా.. మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి అంటూ ట్వీట్ చేసాడు. అంటే నాగ చైతన్య - సమంత లు విడాకుల మేటర్ చెప్పేముందు ఆలోచించాలనా.. లేదంటే చైతు - సామ్ డివోర్స్ మేటర్ లో మీడియా లో వస్తున్న వార్తలపై వెంకీ అలా స్పందించారా అనేది మాత్రం ఎవరికి అంతుబట్టడం లేదు.