Advertisementt

షారుఖ్ కొడుకు ఫోన్ లో.. అలాంటి వీడియోస్

Wed 06th Oct 2021 01:37 PM
aryan khan,ncb court,shah rukh khan,shah rukh khan son aryan khan  షారుఖ్ కొడుకు ఫోన్ లో.. అలాంటి వీడియోస్
NCB sends Shah Rukh Khan son phone for forensic examination షారుఖ్ కొడుకు ఫోన్ లో.. అలాంటి వీడియోస్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఎన్ సీబీ అధికారులకి డ్రగ్స్ తో పాటుగా అడ్డంగా దొరికిన ఆర్యన్ ఖాన్ కి బెయిల్ కూడా దొరకలేదు. ఈ నెల ఏడు వరకు అంటే రేపటివరకు ఆర్యన్ ఖాన్ కి ఎన్ సీబీ కష్టడి విధించింది కోర్టు. ఆదివారం షారుఖ్, కొడుకుని చూసేందుకు వెళ్లగా ఆర్యన్ ఖాన్ కన్నీటి పర్యంతమైనట్లుగా తెలుస్తుంది. షారుఖ్ కి బాలీవుడ్ లో పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ లాంటివారు షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శిస్తున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో మరికొంతమందిని ఎన్ సీబీ అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నమాస్ క్రే ఎక్స్‌పీరియెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులను అరెస్ట్ చేసింది.. ఈ కేసులో ఇప్పటివరకు 16  మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ సీజ్ చేసిన ఎన్ సీబీ అధికారులు ఆ ఫోన్ ని పరిశీలించగా.. వాట్స్ ఆప్ చాట్ లో డ్రగ్స్ డీలర్స్ తో చాట్ లు, అలాగే కొన్ని అభ్యంతరకమైన ఫోటోలు, అశ్లీల వీడియోలు ఆర్యన్ ఖాన్ ఫోన్ లో లభించినట్టు సమాచారం. అయితే ఆ ఫోన్ లో కొందరు సెలబ్రిటీలతో కూడిన ఫోటోలు కూడా షాకింగ్ గురిచేసేలా ఉన్నాయనేది తాజా సమాచారం. ఎన్ సీబీ విచారణలో ఆర్యన్ ఖాన్ సంచలన విషయాలను అధికారులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత డ్రగ్స్ సప్లయర్లపై ఎన్సీబీ అరెస్ట్ ల పర్వం కొనసాగిస్తుంది,. మరి ఆర్యన్ కి రేపైనా బెయిల్ వస్తుందో లేదో చూడాలి.  

NCB sends Shah Rukh Khan son phone for forensic examination:

WhatsApp chats of Aryan Khan, 2 others showed international drug trafficking: NCB to court

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ