Advertisementt

మహేష్ ఆగడు మూవీ నుండి అలా తప్పించారు

Wed 06th Oct 2021 07:57 PM
prakash raj,alitho saradaga show latest promo,ali,ali with prakash raj  మహేష్ ఆగడు మూవీ నుండి అలా తప్పించారు
Alitho Saradaga interview with Prakash Raj మహేష్ ఆగడు మూవీ నుండి అలా తప్పించారు
Advertisement
Ads by CJ

 

మహేష్ బాబు సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఉండడం అనేది మహేష్ సెంటిమెంట్ గా చెబుతుంటారు. అలాంటి మహేష్ బాబు ఆగడు మూవీ నుండి ప్రకాష్ రాజ్ ని తప్పించడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ప్రస్తుతం మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ పై పోటీకి సై అంటున్న ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు, నరేష్ లపై విమర్శలు ప్రతి విమర్శలు, ప్రెస్ మీట్స్ అంటూ నానా హడావిడి చేస్తున్నారు. తనపై వస్తున్న నాన్ లోకల్ ఆరోపణలను బలంగా ఎదుర్కుంటూ మా ఎనిక్కల్లొ ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుస్తుంది అని అందరిని నమ్మేలా చేస్తున్నారు. అయితే అది అలా ఉంటే.. ప్రకాష్ రాజ్ అలీ తో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చారు. ఆ షోలో ప్రకాష్ రాజ్ పర్సనల్ విషయాలతో పాటుగా తనపై వచ్చిన కాంట్రవర్సీలు పై కూడా మాట్లాడారు.

అలీ ప్రకాష్ రాజ్ గారిని మిమ్మల్ని మహేష్ ఆగడు మూవీ నుండి కావాలనే తప్పించినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి.. దీనికి మీ సమాధానం ఏమిటి అని అడిగితే.. అవును ఆగడు సినిమా షూటింగ్ సెట్స్ లో దర్శకుడు శ్రీను వైట్ల గారు స్పీడు కావాలి అన్నారు. కానీ అది నాకు నచ్చడం లేదు అని ఆయనకు చెప్పాను. ఆ సమయంలోనీ శ్రీను వైట్ల గారికి నాకు డిస్టబెన్స్ వచ్చింది. అంతే.. ఆ నెక్స్ట్ డే నే నా ప్లేస్ లోకి సోనూ సూద్ గారు ఆగడు సెట్‌లోకి వచ్చేశారు.. అంటూ అప్పుడు మహేష్ మూవీ నుండి ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చిందో ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ మహేష్ మూవీస్ లో ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తూనే ఉన్నారు.  

Alitho Saradaga interview with Prakash Raj:

Alitho Saradaga show latest promo 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ