Advertisementt

వరుడు కావలెను ఏదో తేడా కొడుతుంటే..

Fri 08th Oct 2021 11:18 AM
varudu kavalenu movie,naga shaurya,ritu varma,lakshmi sowjanya,varudu kavalenu release postponed  వరుడు కావలెను ఏదో తేడా కొడుతుంటే..
Varudu kavalenu out of dasara race వరుడు కావలెను ఏదో తేడా కొడుతుంటే..
Advertisement
Ads by CJ

నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కిన వరుడు కావలెను.. సినిమాని దసరా కి అంటే ఈనెల 15 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా పోస్టర్స్ వేసి మరీ ప్రకటించారు. ఆ తర్వాత ప్రమోషన్స్ హడావుడిలో ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. బ్యూటిఫుల్ గా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తున్న ఈ సినిమా ఇప్పడు దసరా బరి నుండి తప్పుకుంది అనే టాక్ మొదలైంది. ఎందుకంటే దసరా బరిలో రిలీజ్ కాబోతున్న సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, శర్వానంద్ మహా సముద్రం, రోషన్ పెళ్లి సందడి మూవీస్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో మొదలు పెడితే.. వరుడు కావలెను టీం గమ్మునుంది.

ఓ టీజర్, ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ చేసేసి సైలెంట్ అయ్యింది. అయితే ఇప్పుడు మూడు సినిమాల మీద పోటీ ఎందుకు మన సినిమాని నవంబర్ లో రిలీజ్ చేస్తే బావుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారని.. అందుకే ప్రమోషన్స్ ని ఆపేశారని అంటున్నారు. నాగ శౌర్య - రీతూ వర్మ కాంబో చూడ చక్కగా.. కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తున్న ఈ సినిమాని ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ చేస్తే.. సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారట. అయితే నాగ శౌర్య మరో మూవీ లక్ష్య నవంబర్ 4 దివాళి స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత వరుడు కావాలను రిలీజ్ ఉండొచ్చు అని అంటున్నారు. 

Varudu kavalenu out of dasara race:

Varudu kavalenu release postponed?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ