బిగ్ బాస్ లో ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ బాగా ఎమోషన్ అయిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆని మాస్టర్, ప్రియా, రవి ఇంకా శ్వేతా లు పోటీ పడ్డారు. ఆ టాస్క్ లోనే కాస్త గొడవలు గట్రా అయ్యాయి. ఇక ఈ వారం వరెస్ట్ పెరఫార్మెర్ ని ఎన్నుకుని జైలు కి పంపే ప్రాసెస్ లో.. కంటెస్టెంట్స్ మధ్యన వాగ్వాదాలు జరిగాయి. శ్రీరామ్ చంద్ర మీద సిరి, షణ్ముఖ్, జెస్సి లు విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా మానస్ కూడా శ్రీరామ చంద్ర సంచాలక్ బాలేదన్నాడు. ఇక సన్నీ రాత్రి నుండి చూస్తున్నాను అంటూ ఎమోషనల్ గా మారిపోయాడు. రవి - కాజల్ మధ్యన చిన్నపాటి గొడవ జరిగింది.
అయితే ఈ ప్రాసెస్ తర్వాత సన్నీ, ఇంకా మానస్ లు స్మోకింగ్ రూమ్ లో విపరీతంగా ఏడ్చారు. సన్నీ చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ నేను వాళ్ళని పనిష్ చెయ్యాలనుకోలేదు వదిలేద్దామనుకున్నాను అంతే అంటాడు. లోబో మానస్ ని సన్నీ ని ఎంతగా ఓదార్చినా వారు ఊరుకోలేదు. విశ్వ కూడా సన్నీ, మానస్ లు బాధపడడం చూసి సైలెంట్ గా ఉండిపోతాడు. మామ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటూ సన్నీ అయితే ఊరుకోబెట్టినా ఊరుకోకుండా ఏడుస్తున్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు సన్నీ, మానస్ లు ఎందుకు ఏడ్చారు.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల ముందు ఉన్న ప్రశ్న. మరికాసేపట్లో.. బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేస్తుంది.. ఆప్పుడు తెలిసిపోతుంది ఎందుకు ఏడ్చారో అనేది.