సమంత - నాగ చైతన్య నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. సమంత - నాగ చైతన్య కలిసి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సమంత అలా చైతు తో విడిపోతున్నాని చెప్పగానే ఆమె మాజీ ప్రియుడు సిద్దార్థ్ సోషల్ మీడియాలో మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే.. మరి మీరేం నేర్చుకున్నారు.. అంటూ ట్వీట్ చెయ్యడంతో.. అందరూ అది సమంత ని ఉద్దేశించే పెట్టాడు.. సిద్దార్థ్, సమంత వలన మోసపోయి ఉంటాడు అనుకుంటా అంటూ నెటిజెన్స్ సిద్దు పోస్ట్ పై మాట్లాడారు.
అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో తనపై జరుగుతన్న దుష్ప్రచారానికి చెక్ పెట్టాలని.. ఓ పోస్ట్ చేసింది. నాపై వస్తున్న ఆరోపణలు నిజం కాదు.. నేను విడాకులు తీసుకున్నా అనే బాధలో ఉన్నాను అంది. అయితే తాజాగా సిద్దార్థ్ సమంత పై ట్వీట్ చేసాడు అనే విషయంపై మహాసముద్రం ఇంటర్వ్యూ లో స్పందించాడు. నేను సమంత ని ఉద్దేశించి ఎలాంటి ట్వీట్ చెయ్యలేదు. నా జీవితంలో ఏం జరిగిందో అదే మాట్లాడాను. ఆ ట్వీట్ ఎవరి గురించో అనుకుంటే నేనేం చెయ్యలేను.. నా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే.. దాని గురించి ట్వీట్ చేశాను తప్ప నేను ఎవరిని ఉద్దేశించి చెయ్యలేదు అని చెప్పుకొచ్చాడు.