గత నెల 10 న రోడ్డు ప్రమాదంలో గాయాలపై అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఇంకా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వలేదు. ఆయన నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్ అయినా.. సాయి తేజ్ హాస్పిటల్ నుండి బయటికి రాలేదు. అయితే సాయి ధరమ్ తేజ్ తన రిపబ్లిక్ ని హిట్ చేసిన వారికి థంబ్ చూపిస్తూ థాంక్స్ చెప్పాడు కానీ.. ఫేస్ కనిపించలేదు. అయితే సాయి తేజ్ కి భుజానికి సర్జరీ జరగడం అది ఫెయిల్ అవడంతో.. మరోసారి ఆపరేషన్ చెయ్యడం, అలాగే ఓకల్ కార్డు సర్జరీ వలన సాయి తేజ్ నెమ్మదిగా కొలుకుంటున్నాడని.. దసరా తర్వాత సాయి ధరమ్ హాస్పిటల్ నుండి డిస్ఛార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే యాక్సిడెంట్ వలన సాయి ధరమ్ హాస్పిటల్ లో ఎక్కువ రోజులు ఉండడంతో మొహం అదీ పీక్కుపోయి.. పేషేంట్ లా ఉండడంతో.. సాయి తేజ్ అపోలో నుండి డిస్ఛార్జ్ అవ్వగానే.. ఆయన్ని ఫ్యామిలీ మెంబెర్స్ అమెరికాకి తీసుకు వెళ్లనున్నట్లుగా సమాచారం. ఆత్మీయుల, అభిమానుల పరామర్శ్యాలు హడావుడి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఓ రెండు నెలలు అమెరికా లో ఉండి రెస్ట్ తీసుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ తన తదుపరి మూవీ షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సాయి ధరమ్ కోలుకుంటున్నాడని, దసరా తర్వాత డిస్ఛార్జ్ అవ్వొచ్చని అంటున్నారు.