రేపు జరగబోయే మా ఎన్నికల్లో మెగా సపోర్ట్ ఎవరికీ ఉంటుందో అనేది ఇప్పుడు అందరిలో ఉన్న మెగా కన్ఫ్యూషన్. ఎందుకంటే నాగబాబు మెగా ఫామిలీ సపోర్ట్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ కే అంటున్నారు. అంతేకాదు చిరు సపోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ కే అని చెప్పారు. తాజాగా మంచు విష్ణు కూడా మెగా సపోర్ట్ నాదే అంటున్నాడు. మెగా సపోర్ట్ నాకు లేదంటూ ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అంతా నా వాళ్ళే.. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే వారు మీడియా ముందుకు రారు. మా అక్క - చరణ్ - మనోజ్ మంచి ఫ్రెండ్స్.. నేను కలవకపోయినా.. మా ఫ్యామిలీతో చరణ్ క్లోజ్ గా ఉంటాడు అంటున్నాడు. అల్లు అర్జున్ తో ఎక్కువగా చాటింగ్ చేస్తాను అని చెప్పిన విష్ణు శిరీష్ తన తమ్ముడిలాంటివాడని, సాయి ధరమ్ తన చిన్నతమ్ముడు అంటూ ప్రకటించేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ కి మాకు పడదని అంటున్నారు.. పవన్ నటించిన వకీల్ సాబ్ మా ఫ్యామిలీకి అందులో మా నాన్న గారికి బాగా నచ్చింది. వకీల్ సాబ్ చూసాక పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి.. మీ వకీల్ సాబ్ పెరఫార్మెన్స్ చాలా బావుంది అని అనగా.. మీలాంటి పెద్దవాళ్ళు మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అండి అన్నారు పవన్. ప్రతిసారి పవన్ కళ్యాణ్ విషయంలో మా నాన్నగారి పేరెందుకు తీస్తున్నారో ఆయన్నే అడగండి. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మా నాన్నగారు త్వరలోనే సమాధానం ఇస్తారు. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా నాకు ఓట్స్ వేస్తామని చెప్పారంటూ మంచు విష్ణు ఈ ఎన్నికల్లొ మెగా సపోర్ట్ నాదే అని ప్రకటించేసారు.