Advertisementt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రిక్వెస్ట్

Sat 09th Oct 2021 08:21 PM
rajiv kanakala,request,tarak,young tiger ntr,maa elections,maa members  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రిక్వెస్ట్
Request to Young Tiger NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రిక్వెస్ట్
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. రేపు జరగబోయే మా ఎన్నికల క్యాంపెనింగ్ లో ప్రకాష్ vs మంచు విష్ణు ప్యానల్ మధ్యన పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మీద ఫైర్ అవుతుంటే.. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ని మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను అంటున్నాడు. ఇక హేమ, కరాటే కళ్యాణి పర్సనల్ గా గొడవ పడుతున్నారు. జీవిత రాజశేఖర్, రాజీవ్ కనకాల వాళ్ళు పర్సనల్ ప్రెస్ మీట్స్ తో హీట్ పెంచుతున్నారు. మరి రేపు ఈ సమయానికి మా ఎన్నికలు ముగిసి.. ఎవరు మా అధ్యక్షుడో కూడా తేలిపోతుంది. అయితే తాజాగా ఈ మా ఎన్నికల గొడవలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు లాగి జీవిత రాజశేఖర్ కాస్త కాంట్రవర్సీ చెయ్యడమే కాదు.. ఆయన పేరు తీసినందుకు సారి చెప్పింది కూడా.

అయితే ఎన్టీఆర్ మా ఎన్నికల వ్యవహారం వేడిగా ఉంది.. ఇలాంటి సమయంలో నేను ఓటు వెయ్యడానికి రాను అన్నట్టుగా జీవిత ఓ ప్రెస్ మీట్ లో చెప్పడంతో అది కాస్తా కాంట్రవర్సీ అయ్యింది. అయితే తాజాగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ మా ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి.. ఈసారి ప్రతి ఒక్క మా మెంబెర్ ఓటు వెయ్యాలని.. అలాగే ఎన్టీఆర్ ఓటు వెయ్యడానికి రాను అని జీవిత గారు అన్నారు.. తారక్ తో ఆమె ఏం మాట్లాడారో.. తారక్ ఆమెతో ఏం అన్నారో కానీ.. విషయం పూర్తి తెలియకుండా నేను ఏం మాట్లాడలేను. అసోసియేషన్‌ సభ్యులందరూ ఎన్నికల్లో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి. తారక్‌తో కూడా మాట్లాతాను.. ఎన్టీఆర్ కూడా తప్పకుండా ఓటు వెయ్యాలని ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా రాజీవ్ చెప్పారు. 

Request to Young Tiger NTR:

Rajiv Kanakala Request to Tarak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ