ఈ రోజు ఉదయం టాలీవుడ్ లో మా ఎలక్షన్స్ ఓ యుద్ధ వాతావరణాన్ని చూపించాయి. మా ఎన్నికల దగ్గర మంచు విష్ణు ప్యానల్ - ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్యన మాటల యుద్ధం, చేతల యుద్ధం వరకు ఛానల్స్ లో చూసిన పల్లెటూరి జనాల్లోనూ మా ఎన్నికలపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ రోజు మొత్తం మీడియా మా ఎన్నికల చుట్టూనే ఉంది. ప్రకాష్ రాజ్ ఈ మా ఎన్నికల్లో గెలుస్తాడా? మంచు విష్ణు గెలుస్తాడా? అనే ఆసక్తి లో ఉన్న పల్లెటూరి జనాలు.. బెట్టింగ్ లు కాస్తున్నారంటే.. మా ఎన్నికల యుద్ధం ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఎవరు గెలుస్తారో అనే టెంక్షన్ లో వారు గంటగంటకు హైదరాబాద్ లో ఉన్న మీడియా మిత్రులకి ఫోన్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది.
మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో హోరా హోరీగా పోటీ పడ్డారు. ఫలితాలు కూడా నీకా.. నాకా అన్నట్టుగా వస్తున్నాయి. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఎనిమిదిమంది లీడింగ్ లో ఉంటే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు 7 గురు లీడింగ్ లో ఉండడంతో.. ఫలితాలపై ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది. అసలు ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి మా అధ్యక్షుడు అవుతాడో కానీ.. పల్లెటూరి జనాలకు మాత్రం వాళ్ళు సియమ్మో, పియమ్మో అయ్యేంత గా క్రేజీగా ఎదురు చూస్తున్నారు.