బిగ్ బాస్ సీజన్ 5 ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. అయితే బిగ్ బాస్ నుండి ఈ ఆదివారం హమీద ఎలిమినేట్ అవ్వగా.. ఈ రోజు సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం, సభ్యుల మధ్యన హీట్ ని కాదు మంట పెట్టేసింది. ఇద్దరి సబ్యులని నామినేట్ చేస్తూ కారణాలు చెప్పి ఫొటోస్ ని మంటలో వెయ్యాలని బిగ్ బాస్ చెప్పగా.. ఆని మాస్టర్ కి విశ్వ కి మధ్యన చిన్న పాటి గొడవ జరిగింది. అక్కా తొక్క.. చెప్పి రిలేషన్స్ కొనసాగించవద్దు.. స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇక ప్రియా రేషన్ మేనేజర్ గా మీ వర్క్ మీరు చెయ్యడం లేదు అంటూ విశ్వాని నామినేట్ చెయ్యగా.. సిరి - శ్వేతా ల మధ్యన మాటల యుద్ధం నడిచింది. ఇక జెస్సి.. సన్నీ ని ఉద్దేశించి నీకు సపోర్ట్ చెయ్యడం నేను చేసిన బిగ్ మిస్టేక్ అంటే.. నాకు గేమ్ ఆడటం రాదని అన్నావు. నేను ఆడితే తట్టుకోలేవు అంటూ సన్నీ జెస్సి కి సవాల్ విసిరాడు. నువ్వు వచ్చి నీళ్లు పోయగానే నా హృదయం బద్దలైంది అంటూ రవి మానస్ ని నామినేట్ చేసాడు. ఇక ప్రియాంక రోబో ని చూస్తూ ఎవరి ఫోటోనో కోపంగా చించేసి మరీ మంటల్లో వేసేసింది. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్ లోకి వెళ్లారో కానీ.. బిగ్ బాస్ హౌస్ లో ఈ నామినేషన్స్ హీట్.. మంట రాజేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.