Advertisementt

పుష్ప రాజ్ - శ్రీవల్లి లవ్లీ సాంగ్

Wed 13th Oct 2021 12:18 PM
srivalli,rashmika,pushpa - the rise,pushpa pan india movie,sukumar,rashmika - allu arjun,allu arjun,rashmika mandanna  పుష్ప రాజ్ - శ్రీవల్లి లవ్లీ సాంగ్
Srivalli song from Pushpa The Rise released పుష్ప రాజ్ - శ్రీవల్లి లవ్లీ సాంగ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - రష్మిక మందన్న కాంబోలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ డిసెంబర్ 17 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇంకా రిలీజ్ కి రెండు నెలల టైం మాత్రమే ఉండడంతో.. పుష్ప టీం అప్పుడే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప టీజర్, దాక్కో దాక్కో మేక ప్రోమో అద్భుతంగా ప్రేక్షకులని ఆకట్టుకోగా.. ఈ దసరా స్పెషల్ గా శ్రీవల్లి రష్మిక మందన్న, అల్లు అర్జున్ పుష్ప రాజ్ లపై సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. చూపే బంగారమాయెనే  శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే సాంగ్ కి దేవిశ్రీ మ్యూజిక్ అందించగా.. సిద్ధ్‌ శ్రీరామ్‌ పాడాడు.

పుష్ప రాజ్ తన లవర్ ని కళ్ళజోడు పెట్టుకుని ఓరగా, ముగ్ధుడై.. చూస్తుండగా.. శ్రీవల్లి చెవులకి దుద్దులు పెట్టుకుంటూ.. అందంగా కనిపిస్తుంది. శ్రీవల్లి ని టీవీఎస్ బండి ఎక్కించిన సుకుమార్, పుష్ప రాజ్ ని బైక్ ఎక్కించాడు.. పుష్ప రాజ్ మాస్ లుక్ లో వేసే స్వీట్ స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లుక్స్ వైజ్ గా అల్లు అర్జున్ అండ్ రష్మికలు సెన్సేషన్ గా కనిపిస్తున్నారు. శ్రీవల్లి గా రష్మిక డీ గ్లామర్ గా బావుంది. లంగా ఓణీ, లంగా జాకెట్ లో ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇంకా ఈ సినిమాలో అనసూయ, సునీల్, విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. 

Srivalli song from Pushpa The Rise released:

Srivalli Pushpa - The Rise starring Allu Arjun, Rashmika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ